Home » Hanu Man Movie: ప్రభాస్ కొత్త గెటప్ రెడీ.. అందుకే హనుమాన్ మూవీకి సాయం చేయలేకపోయారా..?

Hanu Man Movie: ప్రభాస్ కొత్త గెటప్ రెడీ.. అందుకే హనుమాన్ మూవీకి సాయం చేయలేకపోయారా..?

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రధానంగా ప్రభాస్ బాహుబలి సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. బాహుబలి తరువాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి డిఫరెంట్ సినిమాలు వచ్చినప్పటికీ ప్రేక్షకులు అంతగా మెప్పించలేకపోయాయి. తాజాగా వచ్చిన సలార్ మూవీతో ఆ సినిమాలన్నింటిని మరిపించారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం అదుర్స్ అనే చెప్పాలి. ప్రభాస్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

hanuman-movie

Advertisement

 

ప్రస్తుతం సలార్ 2 తో పాటు కల్కి మూవీలో కూడా నటిస్తున్నారు. అదేవిధంగా మారుతి దర్శకత్వంలో మరో మూవీలో నటిస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. మహానటి దర్శకుడు  నాగ్ అశ్విన్  తెరకెక్కిస్తున్న మూవీ కల్కీ. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొంత వరకు షూటింగ్ జరిగింది. సంక్రాంతి పండుగ తరువాత మిగతా షూటింగ్ పూర్తి కానుంది. ఈ సినిమాలో కొంత పార్ట్ కోసం ప్రభాస్ కొత్త గెటప్ లో కనిపించనున్నట్టు సమాచారం. ఈ గెటప్ కోసం ప్రభాస్ గడ్డం, మీసాాలు బాగా పెంచినట్టు తెలుస్తోంది.  ఈ గెటప్ లో షూట్ ఉండటం వల్లనే ప్రభాస్ బయట కనిపించడం లేదు.

Advertisement

వాస్తవానికి ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీకి ప్రభాస్ సాయం చేద్దామనుకున్నారు. కానీ ఈ గెటప్ వల్లనే రావడం లేదని సమాచారం. నిన్న, మొన్న హనుమాన్ ప్రీ రిలీజ్ కి ప్రభాస్ హాజరు అవుతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ జనవరి 7న హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్‏లో నిర్వహించే వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు సమాచారం. అయితే కల్కీ మూవీలో ప్రభాస్ గెటప్ చాలా ప్రత్యేకం కావడంతో బయటికి రాలేకపోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే.. ఈ గెటప్ లో 10 రోజుల షూట్ తరువాత మళ్లీ గడ్డం, మీసాలు తీసేసి మారుతి మూవీలో నటించనున్నారు ప్రభాస్. మోకాలి గాయం కారణంగా గత కొద్ది రోజుల నుంచి షూటింగ్ లకు కాస్త దూరంగా ఉంటున్నారు. మొత్తానికి సంక్రాంతి పండుగ తరువాత ప్రభాస్ ఫుల్ బిజీ కానున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading