బిగ్ బాస్ సీజన్-7 పదకొండో వారానికి చేరుకుంది. ఇప్పటికే మొదటి రెండు రోజులు నామినేషన్ల ప్రక్రియతో హౌస్ లో ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ వారం ఏకంగా 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మాత్రమే నామినేట్ కాలేదు. ఇక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బిగ్ బాస్ మరో కొత్త టాస్క్ ఇచ్చారు. కంటెస్టెంట్స్ మధ్య ర్యాంకుల పోటీ తీసుకొచ్చారు. మీలో మీరు కొట్టుకొని చావండి నన్ను మాత్రం ఎంటర్ టైన్ చేయండి అన్న రీతిలో ర్యాంకింగ్ గొడవ తెచ్చారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో చూస్తే ఈ ర్యాంకింగ్ పోటీ ఏ రేంజ్ లో సాగిందో అర్థమవుతుంది.
Advertisement
ప్రోమోలో పల్లవి ప్రశాంత్ కు నంబర్ వన్ ప్లేస్ ఇస్తానని శివాజీ చెప్పారు. దీంతో పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. నా లైఫ్ లో ఎవరు చేయలే. అన్న చేసిండు. పల్లవి ప్రశాంత సీజన్-7 ఫస్ట్ కెప్టెన్ అంటూ గుండెలపై భాదుకున్నాడు. ఆ తర్వాత రాతికా మాట్లాడుతూ.. ఫస్ట్ నాలుగు వారాలు నీ గేమ్ ఏమీ లేదు. నీకు ఒకరు హెల్ప్ చేస్తున్నది కనిపియట్లే. నీవు సొంతంగా ఆడుతున్నావో గ్రూపుగా ఆడుతున్నావో కనిపియట్లేదు అని అనడంతో అక్క నువ్వు మా అమ్మ, బాపును తిట్టినావ్. గడ్డం గీకేస్తా అన్నావ్ అంటూ ప్రశాంత్ ఎమోషనల్ అయ్యారు. ఇదేనా ఒక అమ్మాయికి ఇచ్చే మర్యాద అంటూ అశ్విని మండిపడింది. దీంతో వెంటనే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు.. డోంట్ టీచ్ మీ దట్ అని యావర్ అన్నాడు.
Advertisement
ఆ తర్వాత మొదటి పది ర్యాంకుల్లో నిలిచిన వారికి బిగ్ బాస్ ఊహించిన విధంగా షాక్ ఇచ్చాడు. ఈ సీజన్ ఉల్టా ఫుల్టా అని మనకు తెలిసిందే. దీంతో ఆటలో వీకెస్ట్ అనిపించిన వారికే అంటే.. చివరి ఐదు స్థానాల్లో నిలిచిన వారికే ఎవిక్షన్ పాస్ పొందే అవకాశం ఉందని ప్రకటించారు. దీంతో ఎవిక్షన్ పాస్ కోసం ఐదుగురు కంటెస్టెంట్ కు ఓ టాస్క్ ఇచ్చాడు. చివరి ఐదు స్థానాల్లో ఉన్న అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక పోటీపడ్డారు. మరి ఈ గేమ్ లో ఎవరు గెలిచారు ఎవరిని ఎవిక్షన్ పాస్ వరించిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!