1979లో కే.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఒక కల్ట్ క్లాసిక్! సినిమా మొత్తం శంకరా శాస్త్రి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాకు ఆయన పాత్రే కీలకం. అటువంటి పాత్ర కోసం చిత్రబృందం మొదట అక్కినేని నాగేశ్వరరావు ను అనుకున్నారు. తర్వాత శివాజీ గణేషన్ ను అనుకున్నారు. అలాగే ఈ సినిమా అంతా కూడా తన చుట్టూనే తిప్పుకున్న నటి మంజు భార్గవి. ఈమె కన్నడ సినీ నటి. అప్పటికి మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్.
Advertisement
కన్నడంలో మంచి పేరు ఉన్న సమయంలో అనూహ్యంగా ఒక ఫంక్షన్ లో అప్పటి దిగ్గజ దర్శకుడు కే.విశ్వనాథ్ కు ఎవరో పరిచయం చేశారు. ఈ తరుణంలోనే, శంకరాభరణంలో ఛాన్స్ కొట్టేసింది మంజు భార్గవి. తర్వాత ఈ సినిమాలో తన డ్యాన్స్ తో అందరిని అలరించారు. అయితే, ఆ తర్వాత ఆమె ముందుగా ఊహించినట్టుగానే సినిమాలు తగ్గిపోయాయి. అప్పటివరకు తిరుగులేదని అనుకున్న మంజుకు, ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోయింది. అంతేకాదు, మంజు భార్గవిని ఒక దేవతగా భావించేసి పూజించడం కూడా మొదలుపెట్టారు.
Advertisement
దీంతో ఆమె పరిస్థితి ఏమి చేయాలో తెలియని పరిస్థితిగా మారిపోయింది. అవకాశాలు రాక, అలాగని పొగిడేవారు లేక కాదు, అనేకమంది ఉన్నారు. మరి ఆర్థికంగా ఎలా పుంజుకునేది? అనుకున్న సమయంలోనే డ్యాన్స్ స్కూల్ స్టార్ట్ చేసుకున్నారట. నిజానికి శంకరాభరణంతో పేరు వచ్చిన తర్వాత అవకాశాలు సన్నగిల్లిన ఏకైక నటిమని మంజు కావడం గమనార్హం. ఇక ఈ సినిమాలో నటించిన అందరూ కూడా తర్వాత కాలంలో బాగా పుంజుకున్నారు.
READ ALSO : చనిపోయే ముందు నటుడు రంగనాథ్ గోడపై ఏమని రాసారో తెలిస్తే… కన్నీళ్లు ఆగవు!