సాధారణంగా వేసవికాలంలో ఎక్కువగా ఎండ వేడిమి తట్టుకోలేక చల్లని ఐస్ క్రీమ్ తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఐస్ క్రీమ్ శరీరాన్ని చల్లగా ఉంచుతుందని.. దీనిని తినడం వల్ల వేడిలో ఉపశమనం లభిస్తుందని కొందరు నమ్ముతుంటారు. కొంత వరకు ఇది కూడా సరైనదే. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత చాలామంది దాహం వేస్తుంది అనే ఫీల్ వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి ఫీలింగ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా. ఐస్ క్రీమ్ సీజన్ తో వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడతారు. ఈ సీజన్ లో పిల్లలనుంచి పెద్దల వరకు ఐస్ క్రీం అంటే చాలా ఇష్టపడతారు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత దాహం వేయడానికి కారణం ఏమిటని మీరు గమనించారా? ఇలా మీకు మాత్రమే జరుగుతుందని భావిస్తూ ఉంటారు. ఇలా అందరికీ జరుగుతుంది. అయినప్పటికీ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత దాహం వేసిన నీరు తాగకూడదు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఎందుకు దాహం వేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఐస్ క్రీమ్ తిన్నాక దాహం ఎందుకు వేస్తుంది అంటే ఐస్ క్రీమ్ లేదా స్వీట్లు తిన్న తర్వాత దాహం వేయడం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఒక పరిశోధన ప్రకారం.. ఐస్ క్రీమ్ లో చక్కెర, సోడియం రెండూ ఉంటాయి. ఐస్ క్రీమ్ తిన్నప్పుడు, తర్వాత మీ రక్తంలో సోడియం, చక్కెర రెండు కలుస్తాయి. చక్కర మన రక్తంలోకి ప్రవేశించిన తర్వాత అది శరీరమంతటా వ్యాపించడం ప్రారంభమవుతుంది. మన శరీరంలోని కణాల నుంచి నీటిని పీల్చుకోవడం ప్రారంభిస్తుంది.
Advertisement
మన మెదడు ఈ మొత్తం ప్రక్రియను అర్థం చేసుకుంటుంది. మెదడులోని చిన్న భాగానికి సంకేతాలను పంపడం ప్రారంభమవుతుంది. దీనిని హైపోథాలమస్ అంటారు. నిజానికి, ఈ సందేశమే మన శరీరానికి నీరు అవసరమని భావించేలా చేస్తుంది. అందుకే దాహం వేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొందరు ఐస్ క్రీమ్ తిన్న వెంటనే దాహం అనిపించి నీళ్లు తాగుతుంటారు. అయితే మీరు కూడా ఇలా చేస్తుంటే ఆ తప్పును సరిదిద్దుకోండి. వెంటనే నీరు త్రాగడం వల్ల గొంతు నొప్పి, దంత సమస్యలు వస్తాయి. అందుకే ఐస్ క్రీమ్ తిన్న 15 నిమిషాల తర్వాత మాత్రమే నీళ్లు తాగడం ఉత్తమం అని నిపుణులు పేర్కొంటున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
60 WEDS 28.లేటు వయసులో ఘాటు ప్రేమ.. మొదటి భర్తను వదిలి మరీ..!!