Home » ఐపీఎల్‌లో అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ ఇదే.. మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఐపీఎల్‌లో అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ ఇదే.. మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Anji
Ad

ఐపీఎల్ 2024 లో అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ గురించి మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పెద్ద రియాక్షన్ ఇచ్చాడు. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ ఏదో తెల్చేశాడని  చెప్పాడు ఆకాష్ చోప్రా.  రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్‌ ల ఓపెనింగ్ జోడీ ఈ సీజన్‌లో అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ కాగలదని తెలిపాడు.  ప్రస్తుతం ఆకాశ్ చోప్రా కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

Advertisement

Advertisement

ముఖ్యంగా యశస్వి జైస్వాల్‌ 2020 సీజన్‌ నుంచి రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. ఫ్రాంచైజీతో ఇది అతని ఐదవ సీజన్. జోస్ బట్లర్ గురించి మాట్లాడితే, అతను చాలా సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ తరపున కూడా ఆడుతున్నాడు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు ఓపెనింగ్ జోడీగా ఎన్నో విజయాలు సాధించారు. ఐపీఎల్ 2023లో యశస్వి జైస్వాల్ 48 సగటుతో 625 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ కూడా 28 సగటుతో 392 పరుగులు చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన వీడియోలో, ఆకాష్ చోప్రా రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ జోడీని అత్యుత్తమంగా అభివర్ణించాడు. ఆయన మాట్లాడుతూ.. రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ చాలా అద్భుతంగా ఉందని నేను భావిస్తున్నాను. 

ఇది నిజంగా నంబర్ వన్ జంటగా పిలువబడుతుంది. యశస్వి జైస్వాల్ చాలా మంచి ఫామ్‌లో ఉన్నందున నేను ఈ మాట చెబుతున్నాను. అంటే, ఈ సీజన్‌లో అతను 600కు పైగా పరుగులు చేస్తాడన్నమాట. వీళ్లు చాలా ఆత్మవిశ్వాసంతో టోర్నమెంట్‌కి వెళ్తే, భిన్నంగా బ్యాటింగ్ చేస్తుంటారు. గతేడాది కూడా బాగానే బ్యాటింగ్ చేసిన అతను.. ఈసారి మరింత మెచ్యూరిటీతో రాణించనున్నాడు.

Also Read : విశాఖ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ లు.. ఎప్పుడంటే..?

Visitors Are Also Reading