Home » కొండా ఫ్యామిలీ వ‌ల్ల నా ప‌రిస్థితి ఇలా జ‌రిగింది.. వ‌ర్మ కామెంట్స్ వైర‌ల్‌..!

కొండా ఫ్యామిలీ వ‌ల్ల నా ప‌రిస్థితి ఇలా జ‌రిగింది.. వ‌ర్మ కామెంట్స్ వైర‌ల్‌..!

by Anji
Ad

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కునిగా పేర్గాంచిన రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రమే లేదు. అత‌ను సోష‌ల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా వైర‌ల్ అవుతూనే ఉంటుంది. వ్య‌క్తిగ‌తంగా దేవుళ్లు, ద‌య్యాలన్నా.. పుట్టిన రోజు వేడుక‌ల‌న్నా ఆయ‌న‌కు విరక్తి. ఈ మ‌ధ్య‌కాలంలో వ‌ర్మ తీరు కాస్త అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకుంటూ.. దేవాల‌యాల‌కు వెళ్తున్నారు. ఇదంతా ఒక ఎత్త‌యితే.. దానికి ఇది నా నిర్ణ‌యం కాదు అని, వేరొక‌రి ప్ర‌భావం అని వ‌ర్మ చెబుతున్న తీరు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Advertisement

ఈ త‌రుణంలోనే తాజాగా గుడికి వెళ్లిన వ‌ర్మ‌.. కొండా ఫ్యామిలీ మూలంగానే వెళ్లిన‌ట్టు చెప్పుకొచ్చారు. వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత‌లు కొండా ముర‌ళి-సురేఖ జీవిత క‌థ ఆధారంగా కొండా పేరుతో ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నారు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గానే.. బోలెడు వివాదాలు వెంటాడాయి. అయినా వాటిన్నింటిని ప‌ట్టించుకోకుండా వ‌ర్మ షూటింగ్ పూర్తి చేశారు. ఇక సినిమా విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. సినిమా స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటూ కొండా దంప‌తులతో క‌లిసి బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకుంటున్నారు ఆర్జీవీ. గుడిలో పూజ జ‌రుగుతుండ‌గా కూర్చున్న ఫోటోల‌ను, వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసి కొండా సినిమాకు మంచి మార్కెట్ చేసుకుంటున్నారు.

Advertisement

ఇక ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా త‌న‌కు కొండా ఫ్యామిలి కార‌ణంగానే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని రామ్‌గోపాల్ వ‌ర్మ చేసిన కామెంట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయిది. ఇక ఈ కామెంట్ చూసిన నెటిజ‌న్లు ఎవ్వ‌రికీ న‌చ్చిన విధంగా వారు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. విజ‌యవాడ‌లో ఇంజినీరింగ్ చ‌దువుతున్న‌ప్పుడు దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి రాలేదు కానీ కొండా సురేఖ దంప‌తుల వ‌ల్ల అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నా. కొండా దంప‌తుల భ‌క్తి పార‌వ‌శ్యం న‌న్ను ఆక‌ర్షించింది. ఇక కొండా సినిమా హిట్ కావాల‌ని అమ్మ‌వారిని కోరుకున్న‌ట్టు చెప్పుకొచ్చారు వ‌ర్మ‌. కొండా ముర‌ళి స‌బ్జెక్ట్ ఐదు ఆరు సినిమాలు తీసినా చాల‌ద‌ని వెల్ల‌డించారు. వ‌ర్మ మాకు దేవుడు పంపిన దూత‌గా వ‌చ్చి మా బ‌యోపిక్ తీశార‌ని, త‌న పాత్ర చేయ‌డానికి హీరోయిన్ చాలా క‌ష్ట‌ప‌డింద‌ని చెప్పుకొచ్చారు కొండా సురేఖ‌.

 

Also Read : 

భారీ మల్టీ స్టారర్ గా ప్రారంభించిన నాగార్జున, బాలకృష్ణ సినిమా ఆ ఒక్క కారణం వళ్లే ఆగిపోయిందా..!

న‌య‌న‌తార భర్త విఘ్నేష్ శివ‌న్ గురించి షాకింగ్ విష‌యాలు మీకు తెలుసా..?

 

Visitors Are Also Reading