టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో మెగాస్టార్ మేనకోడలుగా నటించిన శ్రియా శర్మ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో భూమిక, సమీరారెడ్డి హీరోయిన్లుగా నటించారు. శ్రీయ శర్మ తన చిన్ని చిన్ని మాటలతో చిరంజీవి మేనకోడలుగా నటించి మంచి గుర్తించు తెచ్చుకున్నది. నువ్వు నేను ప్రేమ చిత్రంలో శ్రీయశర్మ చైల్డ్ ఆర్టీస్ట్‌గా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయితే ఆ చిత్రంలో సూర్య జ్యోతిక కూతురిగా నటించింది.
Jai Chiranjeeva Child artist
ఆ తరువాత చైల్డ్ ఆర్టీస్ట్‌గా హిందీ, తమిళ, కన్నడ, ఇలా దాదాపు అన్ని భాషల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయినా మహేష్‌బాబు సినిమా దూకుడులో కూడా సమంత చెల్లి పాత్రలో నటించింది. అదేవిధంగా తెలుగు సినిమాలు అయిన రచ్చ, తూనీగ తూనీగ, ఎటో వెళ్లిపోయింది వంటి సినిమాల్లో టీనేజీ అమ్మాయిగా కనిపించి అందరినీ ఆకట్టుకుంది.
Jai chiranjeeva child artist shriya sharma
టీనేజ్ అమ్మాయి పాత్రలు చేస్తున్న సమయంలోనే హీరోయిన్‌గా చేసే అవకాశం వచ్చింది. అదేవిధంగా బిగ్‌బాస్‌తో ఫేమస్ అయినా అలీరాజా హీరోగా తెరకెక్కిన గాయకుడు సినిమాలో శ్రీయశర్మ హీరోయిన్‌గా నటించింది. ముఖ్యంగా గాయకుడు సినిమా ఆశించిన విజయం సాధించలేదనే చెప్పవచ్చు.
Jai chiranjeeva child artist shriya sharma
ఆ తరువాత హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్‌కు జోడీగా నిర్మల కాన్వెంట్ అనే చిత్రంలో కూడా నటించింది. ఆ చిత్రం తరువాత శ్రీయశర్మ తన దృష్టిని మోడలింగ్‌పైనే పెట్టింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే శ్రీయ ఎప్పటికప్పుడూ తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది.
Also Read: బీపీఎల్‌లో “పుష్ప వాక్” తో డ్వేన్ బ్రావో సెలబ్రేషన్స్..!