Home » సర్వర్లను క్రాష్ చేసేస్తున్న హాలీవుడ్ మూవీ

సర్వర్లను క్రాష్ చేసేస్తున్న హాలీవుడ్ మూవీ

by Bunty
Ad

సాధారణంగా హాలీవుడ్ సినిమాలకు క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. ఇక అక్కడ నుంచి వచ్చే సూపర్ హీరోల సినిమాలకు ఇక్కడ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మార్వెల్ సంస్థ నుంచి వచ్చే సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంటుంది. ఇండియాలో సైతం ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా సూపర్ హీరో మూవీ ‘స్పైడర్ మాన్ నో వే హోమ్’ ఇండియాలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ఓపెన్ చేశారు.

Spider Man No Way Home: Marvel DROPS much awaited poster featuring Tom  Holland & Benedict Cumberbatch | PINKVILLA

Advertisement

Advertisement

అయితే ఆశగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి అనుకుంటున్న అభిమానులకు మాత్రం నిరాశ మిగిలింది. ఎందుకంటే ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ అలాంటిది మరి. ప్రస్తుతం రానున్న ‘స్పైడర్ మాన్ నో వే హోమ్’ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ అందిస్తున్న ఆయా వెబ్ సైట్లలో సర్వర్లు క్రాష్ అవుతున్నాయట. అదన్నమాట సంగతి. అందుకే ఈ సినిమా కోసం నెట్లో బుక్ చేసుకోవడంలో ఆలస్యం చేసిన ప్రేక్షకులకు నిరాశ తప్పట్లేదు. మొత్తానికి ఇటీవల వచ్చిన హాలీవుడ్ సినిమాలన్నింటిలో కెల్లా స్పైడర్ మాన్ గురించి ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఈ సంఘటనతో తెలిసిపోయింది. ఇక ఈ సినిమాలో మావో సూపర్ హీరో డాక్టర్ స్ట్రేంజ్ కూడా కన్పిస్తుండడం దీనికి ప్రధాన కారణం అయ్యి ఉండొచ్చు.

Visitors Are Also Reading