Home » తొలి ఏకాదశి రోజు ఇంట్లో ఈ వంటకం అస్సలు వండకూడదట.. ఏంటది..?

తొలి ఏకాదశి రోజు ఇంట్లో ఈ వంటకం అస్సలు వండకూడదట.. ఏంటది..?

by Sravanthi
Ad

జులై 10 తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఏది వండిన, వండకపోయినా సరే ఈ కర్రీ మాత్రం అస్సలు వండకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ఒకవేళ ఆ వంట, వండినా అది తిన్న మన ఇంట్లో అరిష్టం పడుతుందట. ఆషాఢ మాస ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈరోజు నుంచి శ్రీమహావిష్ణువు క్షీరాబ్ధి యందు సేవిస్తాడు. ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. ఏకాదశి రోజు చాలామంది ఉపవాసం ఉంటారు. ఈరోజు గోపద్మ వ్రతం ఆచరిస్తారు.

Advertisement

దీని తొలి ఏకాదశి నుంచి క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాల్లో చెబుతూ ఉంటారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసంతో పాటుగా పేదలకు దానం చేస్తే చాలా మంచిది అన్నారు పెద్దలు. కాబట్టి ఏకాదశి రోజున దానధర్మాలు చేస్తే మంచి కలుగుతుందట. శక్తికొద్దీ భక్తి అన్నారు పెద్దలు మన శక్తిని బట్టే ఆ భగవంతుడిని పూజించడం కానీ దానధర్మాలు చేయడం కానీ, ఉపవాసం కానీ చేయాలని అంటుంటారు. ఈ విధంగా రోజంతా ఏమీ తినకుండా నిష్టగా ఉండి మరుసటి రోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి పూజా కార్యక్రమం ముగించుకొని ఆ తర్వాత భోజనం చేయాలి.

Advertisement

 

మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్ష సిద్ధి పొందడం జరిగిందట. అలాగే ఉపవాసం చేయడం వల్ల మనిషికి ఇంద్రియ నిగ్రహం కలిగి, కామ క్రోధ, మద,మా చర్యలను జయించడం వలన దేనినైనా సాధించగలమనే శక్తి వస్తుందట. ప్రత్యేకంగా ఈ రోజు మాంసం ఇంట్లో అసలు వండకూడదట, దీంతోపాటుగా మద్యం సేవించరాదు, అబద్దాలు ఆడరాదు, మోసం చేయకూడదు. ఎంతో నిష్ఠగా ఆ దేవుడి జ్ఞానం లో ఉంటే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

also read:

Visitors Are Also Reading