Home » చెన్నై:అర్ధరాత్రి 12..రోడ్డుపై శ్రీ రెడ్డి.. హలో బండి ఆపు నీ నెంబర్ ఇస్తావా అంటూ..!!

చెన్నై:అర్ధరాత్రి 12..రోడ్డుపై శ్రీ రెడ్డి.. హలో బండి ఆపు నీ నెంబర్ ఇస్తావా అంటూ..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది బ్యూటీ శ్రీ రెడ్డి. తనకు నచ్చిన వాళ్ళని పోగుడుతుంది, తనకు నచ్చని వాళ్లను రచ్చకీడుస్తుంది. ప్రస్తుతం ఆమె ఎక్కువ సినిమాల్లో నటించకపోయినా సరే విపరీతమైనటువంటి అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఎలాంటి సినీ అవకాశాలు రాకపోవడంతో శ్రీ రెడ్డి తన యొక్క సొంత యూట్యూబ్ ఛానల్ లో వంటల ప్రోగ్రాం ద్వారా, చికెన్ కర్రీ, రొయ్యలు, చేపల పులుసు ఇలా రోజుకో రకం వెరైటీ వంటలతో అందరినీ ఆకట్టుకుంది. ఎప్పుడూ ఏదో ఒక విషయం తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ గా ఉండే ఈ బ్యూటీ తన రూటు మార్చింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పేరుతో ఇండస్ట్రీ లో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులకు నిద్ర పట్టకుండా చేసిన ఈ అమ్మడు, ఫిల్మ్ ఛాంబర్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది.

Advertisement

దీని తర్వాత ఆమెను కొంతమంది సినిమా ఆఫర్లు రాకుండా చేశారని ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న సమయంలో శ్రీరెడ్డి చెన్నైకి మకాం మార్చింది. సినిమాల్లో ప్రయత్నాలు చేస్తూనే సోషల్ మీడియాలో ఆదాయాన్ని సంపాదించుకునే మార్గాలను వెతుకుతోంది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో పాపులర్ కావడం కోసం అక్కడ యూట్యూబ్ చానల్స్ కు వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. అయితే ఆమె ఇంటర్వ్యూలకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమె కోసం ఎగబడుతున్నారు. ఇక రొటీన్ గా ఇంటర్వ్యూలు చేస్తే ఏముంటుందని అనుకున్నారో ఏమో కానీ, “వన్ డే నైట్ డేటింగ్” అనే యూట్యూబ్ ఛానల్ యాంకర్ తో రాత్రిపూట జర్నీ చేస్తూ వెరైటీగా ఇంటర్వ్యూ ఇచ్చింది.

Advertisement

ఈ సమయంలో యాంకర్ కు ముద్దు పెట్టుకోవడానికి అతని మీద పడటం, కారులో ఉన్నటువంటి లైట్లు ఆర్పడం, లాంటి ఆసక్తికర సన్నివేశాలతో హైలెట్ అయ్యింది. చివరికి యాంకర్, శ్రీరెడ్డికీ ఇచ్చిన ఒక ఛాలెంజ్ కు కూడా ఒప్పుకుంది అమ్మడు, అదేంటంటే ఇప్పటివరకు నువ్వు ఎవరి దగ్గర అయినా ఫోన్ నెంబర్ తీసుకున్నావా.. అని యాంకర్ అడగటంతో లేదని చెప్పింది శ్రీరెడ్డి. అయితే ఈ రాత్రి సమయంలో నువ్వు కారు దిగి వెళ్లి నెంబర్ తీసుకుని వస్తావా అని అడగటంతో శ్రీరెడ్డి దానికి ఓకే అనేసింది. వెంటనే కారు దిగి వెళ్లి, రాత్రి రోడ్డుపై వెళ్తున్నటువంటి బైక్లను ఆపి వారి ఫోన్ నెంబర్ ని అడిగింది రెడ్డి. బైకు ఆపిన వారిలో కొంత మంది ఈ పాప ఎవరు అని అడిగే వాళ్ళు ఉన్నారు, కానీ కొందరు ఆమె సొగసైన అందాలు చూసి బైకు ఆపి మరి నెంబర్లు ఇచ్చేందుకు ఉత్సాహపడుతున్నారు. ప్రస్తుతం రెడ్డి చేసిన పర్ఫామెన్స్ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది.

also read:

Visitors Are Also Reading