Home » ఈ స్టార్ కమెడియన్స్ రాజకీయాల్లోకి వెళ్లి సినీ కెరియర్ ని నాశనం చేసుకున్నారా..?

ఈ స్టార్ కమెడియన్స్ రాజకీయాల్లోకి వెళ్లి సినీ కెరియర్ ని నాశనం చేసుకున్నారా..?

by Mounika
Ad

 ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు జనాలలో మంచి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత  రాజకీయాల్లోకి రావడం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకు అన్నగారు ఎన్టీఆర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కొంతకాలం తర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి సీఎంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించారు. ఆ తర్వాత స్టార్ హీరోలు ఎందరో రాజకీయ  ప్రవేశం చేసినా కూడా ఎన్టీఆర్  లాగా రాజకీయాల్లో  అంతగా  ఎదగలేకపోయారు. ఇక స్టార్ హీరోలే కాకుండా కమెడియన్లుగా ఏదో సాధించాలని రాజకీయ ప్రవేశం చేశారు. కానీ వారు రాజకీయాల్లో వెళ్లి ఇటు సినిమా ఆఫర్లను కోల్పోతూ అటు రాజకీయాల్లో ఆశించని ఫలితాలను సొంతం చేసుకోలేకపోతున్నారని  విమర్శల పాలవుతున్నారు.

Advertisement

 

ఈ జాబితాలో ముందుగా గుర్తొచ్చే కమెడియన్ పేరు అలీ. సీతాకోక చిలుక చిత్రంతో తన కెరియర్ ని మొదలుపెట్టిన అలీ.. కమెడియన్ గా, హీరోగా తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలీ కమెడియన్గా ఎక్కువ శాతం సినిమాలో పవన్ కళ్యాణ్ చిత్రాల్లోనే నటించారు.అలీ ఎప్పుడైతే వైసీపీ కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించారో మిత్ర ద్రోహి అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. భవిష్యత్తులో పవన్, అలీ కలిసి నటించే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతం అలికి కమెడియన్గా అవకాశాలు తగ్గినట్లే కనిపిస్తున్నాయి.

Advertisement

 ఇక ఇదే కోవకు చెందిన  వారిలో రచయిత కమెడియన్  గా  గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణమౌళి కూడ ఉన్నారు. ఈయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ  సానుకూలంగా ఫలితాలు దక్కించుకోలేకపోతున్నారు. పోసాని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్నాడు అంటూ ఆయనపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

ఇక మరో కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ప్రేక్షకుల్లో ఒక్కసారిగా  మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు పృద్విరాజ్. ప్రస్తుతం పృథ్వి జనసేన పార్టీతో రాజకీయ ప్రవేశం చేశారు. పృధ్విరాజ్ కెరియర్ కూడా ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. గత కొంతకాలంగా ఇతను కూడా ఏ పెద్ద చిత్రాలలోనూ కనిపించడం లేదు.

ఈ స్టార్ కమెడియన్స్ రాజకీయాల్లో ప్రవేశించి తమ చేతులారా వారి సినీ కెరియర్ ని నాశనం చేసుకున్నారని  అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా ఎదుటి పార్టీ వాళ్ళు విమర్శించడమే కోసమే వీళ్లను ఆటలు అరటిపండులా  పార్టీలో చేర్పించుకున్నారు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

Kanguva First Glimpse: సూర్య అదిరిపోయే లుక్.. ఫస్ట్ గ్లిమ్ప్స్ అదిరిందిగా!

సమంత బెడ్ రూంలో విజయ్… అక్కడ చేతులు వేస్తూ?

Colors Swathi: శంకరాభరణం సినిమా నుంచి స్వాతి ఎందుకు తప్పుకుంది? అసలు కారణం ఇదే!

 

Visitors Are Also Reading