ఈరోజుల్లో చాలామంది ఫోన్ కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఫోన్ లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ఫోన్ కి ఎడిక్ట్ అయ్యారని ఎలా తెలుసుకోవచ్చు..? ఫోన్ కి మీరు కూడా బానిసలు అయ్యారో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేయండి. అప్పుడు ఫోన్ కి ఎడిక్ట్ అయ్యారా లేదా అనే విషయం మీకు తెలిసిపోతుంది. చాలామంది ఫోన్ లేకపోతే పిచ్చి వాళ్ళు అయిపోతూ ఉంటారు. మొబైల్ ఫోన్ కి మీరు ఏ లెవెల్ లో ఎడిక్ట్ అయ్యారో ఈజీగా తెలుసుకోవచ్చు. మీరు మీ ఫోన్ ఇంట్లో వదిలేసి ఒకసారి బయటికి వెళ్ళండి ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ కనుక మీకు ఉన్నట్లయితే పరవాలేదు.
Advertisement
Advertisement
కానీ బయట ఏ పని చేయాలనిపించకపోవడం వెంటనే ఫోన్ ని చేతిలోకి తీసుకోవాలి అనుకోవడం వంటివి జరిగితే ఖచ్చితంగా మీరు ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయారని అర్థం చేసుకోవాలి. ఫోన్ ఎవరి చేతిలోనైనా పగిలినా ఫోన్ ని పాడు చేసిన వాళ్ల మీద విపరీతమైన కోపం వచ్చినట్లయితే కూడా కచ్చితంగా మీరు ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయారని అర్థం చేసుకోవాలి. ఫోన్ కొంత సమయం కనపడకుండా పోతే అన్నం తినకుండా ఉండడం లేదంటే చిరాకు పడడం వంటివి చేస్తే కూడా మీరు ఫోన్ కి బాగా ఎడిక్ట్ అయిపోయారు అని తెలుసుకోవచ్చు. పదేపదే ఫోన్ ని తీస్తూ చూడడం ఫోన్ మైకంలో ప్రశాంతతని కోల్పోవడం ఇలాంటివి జరిగితే కూడా ఫోన్ కి బాగా అలవాటు అయినట్టు మీరు తెలుసుకోవాలి.
Also read:
- ఈ ఆకుకూరలతో.. కాలేయం దృఢంగా ఉంటుంది.. పైగా ఈ సమస్యలూ రావు..!
- అమ్మాయిలూ… అబ్బాయిని పెళ్లి చూపుల్లో మరచిపోకుండా… ఈ ప్రశ్న అడగాలి…!
- భర్త కి బుద్ధి చెప్పాలనుకుంది… కానీ చివరికి లైఫ్ ఏ నాశనం అయిపోయింది…!