Home » అవెన్‌లో వీటిని అస్స‌లు వండ‌కూడ‌ద‌ట‌..!

అవెన్‌లో వీటిని అస్స‌లు వండ‌కూడ‌ద‌ట‌..!

by Anji
Ad

ప్ర‌తి ఒక్క‌రి ఇండ్ల‌లో ఇప్పుడు మైక్రోవేవ్ అవెన్ ఓ భాగం అయిపోయింది. బేక్ చేయడం, గ్రిల్ చేయ‌డంతో పాటు కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను వండుకోవ‌డానికి, వేడి చేసుకోవడానికి దీనిని ఉప‌యోగిస్తుంటారు. ఏ వంట అయినా నిమిషాల్లో సిద్ధం అయిపోతుంది. కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను వండుకోవ‌డానికి అవెన్‌ను ఉప‌యోగించుకోవ‌డ‌మే మంచిది అంటున్నారు నిపుణులు. ఏవి వండ‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముఖ్యంగా కోడిగుడ్ల‌ను త‌క్కువ స‌మ‌యంలో ఉడికించ‌డానికి కొంత‌మంది అవెన్ వాడుతుంటారు. వాస్త‌వానికి ఈ స‌మ‌యంలో మ‌నం ఎక్కువ ఉష్ణోగ్ర‌తను సెట్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా అందులోని కీల‌క పోష‌కాలు న‌శించిపోయే అవ‌కాశం ఉంది. వాటిని స్టౌ లేదా ఎగ్ బాయిల‌ర్‌లో ఉడికించ‌డ‌మే ఉత్త‌మం.

Also Read  :  సమతామూర్తి క్షేత్రాన్ని సందర్శించిన పవన్​కల్యాణ్​

  • అన్నంను అవెన్‌లో ఉడించుకోవ‌డం వ‌ల్ల అందులోని Bacillus Cereus అనే బ్యాక్టిరియా అన్నాన్ని విష‌పూరితం చేసే ప్ర‌మాదం ఉందంటున్నారు నిపుణులు. త‌ద్వారా అజీర్తి, ఇత‌ర జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. మిగిలిపోయిన అన్నాన్ని అవెన్‌లో వేడి చేసుకోవ‌డం కూడా మంచిది కాదంటున్నారు.

 

  • ప్రాసెస్ చేసిన మాంసం మైక్రోవేవ్ అవెన్ రేడియేష‌న్‌కు గురైన‌ప్పుడు కొలెస్ట్రాల్ అక్సిడేష‌న్ ప్రొడ‌క్ట్స్ గా రూపాంత‌రం చెందుతుంది. ఈ త‌ర‌హా కొవ్వులు క‌రోనరీ ఆర్ట‌రీ డిజీస్ దారి తీస్తాయి. ఫ‌లితంగా గుండె ఆరోగ్యం దెబ్బ‌తింటుందని పేర్కొంటున్నారు నిపుణులు.

 

  • చికెన్ మ‌ష్రూమ్ వంటివి వండ‌టానికి, ఉడికించడానికి అవెన్ వాడినా, ఆయా ప‌దార్థాల‌ను ఇందులో వేడి చేసినా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేష‌న్ కార‌ణంగా వాటిలోని పోష‌కాలు న‌శించిపోయే అవ‌కాశాలు ఎక్కువ‌.

Advertisement

  • తీసి నిలువ చేసిన త‌ల్లిపాల‌ను వేడి చేయ‌డానికి అవెన్‌ను ఉప‌యోగించ‌డం స‌రికాదు. అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ ప్ర‌కారం.. వేడి చేయాల‌నుకుంటే బాటిల్‌పై వేడి నీళ్ల‌ను పోస్తూ.. లేదంటే వేడి నీళ్ల కుళాయి కింద బాటిల్‌పై ఉంచి గోరు వెచ్చగ అయ్యాక ఓ బాటిల్‌ను షేక్ చేసి పాపాయికి తాగించ‌మ‌ని సూచిస్తుంది.

 

  • పండు మిర్చితో కొన్ని ర‌కాల వంట‌కాలు త‌యారు చేస్తుంటాం. అయితే వీటిని అవెన్‌లో వండితే అందులోని క్యాప్స్రైసిన్ అనే రసాయ‌నం షూటు వాయువుల‌ను వెలువ‌రిస్తుంది. త‌ద్వారా అవెన్ తెర‌వ‌గానే క‌ళ్ల‌లో మంట‌, గొంతు మంట‌, ద‌గ్గు, వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఒక్కోసారి ఈఘాటు ఎక్కువ అయితే అవెన్ లోప‌ల మంట కూడా వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంద‌ట‌. ఘాటు అయిన ప‌దార్థాల‌ను గాలి బాగా ప్ర‌స‌రించే ప్ర‌దేశాల్లో స్టౌపై వండుకోవ‌డం మంచిది.

 

  • అదేవిధంగా అవెన్‌లో వేడి చేసుకోవ‌డానికైనా, వండుకోవ‌డానికి అయినా స‌రైన ఉష్ణోగ్ర‌త సెట్ చేసుకోవ‌డం, ప్లాస్టిక్ పేప‌ర్ త‌ర‌హా పాత్ర‌లు ఉప‌యోగించుకోవ‌డం వంటి జాగ్ర‌త్త‌లుకూడా పాటించాల్సి ఉంటుంది.

Also Read  :  Today rasi phalalu in telugu : ఆ రాశివారు బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి

 

Visitors Are Also Reading