Home » Chanakya Niti : ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న క‌లిగిన వారిని క‌ష్టాలు వెంటాడుతాయి.. వారు ఏమి చేయాలంటే..?

Chanakya Niti : ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న క‌లిగిన వారిని క‌ష్టాలు వెంటాడుతాయి.. వారు ఏమి చేయాలంటే..?

by Anji
Ad

ఆచార్య చాణ‌క్యుని ఆలోచ‌న‌ల‌ను స్వీక‌రించి చంద్ర‌గుప్త మౌర్య‌ మ‌గ‌ధ సామ్రాజ్యాన్న పాలించాడ‌ని పేర్కొంటున్నారు. చాణ‌క్య తెలిపిన జీవ‌న విధానాలు ప్ర‌భావ‌వంతంగా ఉంటాయి. చాణ‌క్యునికి రాజ‌కీయాల‌కే కాకుండా స‌మాజానికి సంబందించిన ప్ర‌తీ విష‌యంపై లోతైన అవ‌గాహ‌న ఉంది. ముఖ్యంగా ఏ విధంగా జీవించాలో అని జీవ‌న విధానాల‌ను రూపొందించారు. స‌మాజంలోని దాదాపు ప్ర‌తి అంశానికి సంబంధించిన ముఖ్య‌మైన విష‌యాల‌ను ప్ర‌స్తావించారు.

Also Read :  అలా చేయొద్ద‌ని ప‌వ‌న్ తో ఒట్టు పెట్టించుకున్న మెగాస్టార్..!

Advertisement

 

ఒక వ్య‌క్తి జీవితానికి సంబంధించిన అనేక ముఖ్య‌మైన విష‌యాలు, ఆచార్య చాణక్యుని జీవన విధానాల పుస్త‌కంలోక‌నిపిస్తాయి. లైఫ్ కోచ్‌గా పేరుపొందిన చాణ‌క్య‌.. ఒక వ్య‌క్తి త‌న ప్ర‌వ‌ర్త‌న ద్వారా జీవితంలో ఆనందాన్ని, శ్రేయ‌స్సును ఎలా పొంద‌వ‌చ్చో తెలిపారు. ఈకోవాలోనే ఆచార్య చాణ‌క్య జీవితంలో త‌రుచూ న‌ష్టాన్ని వైఫ‌ల్యాన్ని ఎదుర్కునే వారి గురించి కూడా తెలిపారు.

Advertisement

చాణ‌క్యుడు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. స‌మ‌యానికి ఉన్న ప్రాముఖ్య‌త అర్థం చేసుకోని వారు త‌రుచూ వైఫ‌ల్యాల‌ను ఎదుర్కుంటారు. అలాంటి వారు క‌ష్టాల్లో కూరుకుపోతార‌ని ఆచార్య చాణ‌క్య వెల్ల‌డించారు. వాస్త‌వానికి గ‌డిచిన కాలం తిరిగి రాదు. ప్ర‌తీ క్ష‌ణాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ స్థిర‌మైన జీవితాన్్ని తీర్చిదిద్దుకోవాల‌ని ఆచార్య చాణ‌క్య సూచించారు. కోపం ఆచార్య చాణ‌క్యుడు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కోపం అనేది వ్య‌క్తికి అతి పెద్ద శ‌త్రువు. కోపాన్ని అదుపు చేసుకోలేద‌ని వార న‌ష్టాన్ని ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అంతేకాదు వారిని వైఫ‌ల్యం కూడా వెంటాడుతుంది. నిజానికి కోపంతో ఊగిపోయే వారిని చుట్టుప‌క్క‌ల వారు ఇష్ట‌ప‌డ‌రు.

అదేవిదంగా అలాంటి వారు ప‌క్క‌న కూర్చునేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌రు. ఆదాయానికి మించిన ఖ‌ర్చులు చాణ‌క్య నీతిలోన వివ‌రాల ప్ర‌కారం.. మ‌న‌మంద‌రం మ‌న ఆదాయానికి అనుగుణంగా ఖ‌ర్చు చేయాలి. కొంద‌రూ త‌మ ఆదాయం కంటే ఎక్కువ ఖ‌ర్చు చేస్తారు. ఇటువంటి వారి ఈ అల‌వాటు వ‌ల్ల ఆర్థిక సంక్షోభ ప‌రిస్తితుల‌ను ఎదుర్కోవాల్సి రావ‌చ్చు. అందుకే డ‌బ్బు విష‌యంలో పొదుపుగా ఉండాల‌ని, ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదురుకావ‌ని ఆచార్య చాణ‌క్య తెలిపారు. డబ్బు వృథా చాణ‌క్య నీతి ప్ర‌కారం.. దేవ‌త మ‌హాల‌క్ష్మీ అమ్మ‌వారు. చంచ‌ల స్వ‌భావం క‌ల‌వారి ఇంట ల‌క్ష్మీదేవి నివ‌సించ‌దు. ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం కార‌ణంగా ధ‌నం ల‌భించిన‌ట్ట‌యితే ఆ డ‌బ్బు వృథా కాకుండా చూసుకోవాలి. డ‌బ్బును అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌కు వినియోగిస్తే.. త‌రువాత చింతించాల్సి వ‌స్తుద‌ని ఆచార్య చాణ‌క్య సూచించారు.

Also Read :  రాజీవ్‌గాంధీకి మురారి సినిమాకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసా..?

Visitors Are Also Reading