Home » త్వ‌ర‌లో బిగ్ బాస్ ఓటీటీ…ఎంట్రీ ఇస్తున్న మాజీ కంటెస్టెంట్లు వీరే…!

త్వ‌ర‌లో బిగ్ బాస్ ఓటీటీ…ఎంట్రీ ఇస్తున్న మాజీ కంటెస్టెంట్లు వీరే…!

by AJAY
Ad

బిగ్ బాస్ సీజ‌న్ 5 పూర్తైన వెంట‌నే బిగ్ బాస్ సీజ‌న్ 6 కూడా షురూ కాబోతుంద‌ని వార్త‌లు ఊపందుకున్నాయి. బిగ్ బాస్ నిర్వాహ‌కులు కూడా త్వ‌ర‌లోనే బిగ్ బాస్ సీజ‌న్ 6 షురూ కాబోతుంద‌ని క‌న్ఫామ్ కూడా చేశారు. అయితే ఇది వ‌ర‌కు మాదిరిగా కాకుండా బిగ్ బాస్ సీజ‌న్ 6 ఓటిటి ద్వారా 24 గంట‌ల పాటూ ప్ర‌సారం కాబోతుంద‌ని వెల్ల‌డించారు. అంతే కాకుండా బిగ్ బాస్ ఓటిటి హాట్ స్టార్ లో ప్ర‌సారం కాబోతుండ‌గా దీనికి నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు.

bigg boss telugu 6

bigg boss telugu 6

ఇక హౌస్ లోకి వెళుతున్న వారిపై ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ సీజ‌న్ లో ఢీ విన్న‌ర్ రాజు, టిక్ టాక్ దుర్గారావు, ర‌ఘుమాస్ట‌ర్, యాంక‌ర్ వ‌ర్షిణి పేర్లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే మాజీ కంటెస్టెంట్ లు కూడా బిగ్ బాస్ ఓటీటీలో మెర‌వ‌బోతున్నారు అంటూ కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

Advertisement

Advertisement

hariteja

hariteja

ఇక తాజాగా బిగ్ బాస్ ఓటిటి లోకి ఎంట్రీ ఇస్తున్న‌రంటూ కొంత‌మంది మాజీ కంటెస్టెంట్ ల పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వారిలో అరియానా గ్లోరీ, ఆద‌ర్శ్, అఖిల్, త‌నిశ్, అలి రైజా, హ‌రితేజ పేర్లు ఉన్నాయి. ఇక వీరంతా కూడా బిగ్ బాస్ ప‌లు సీజ‌న్ల‌లో ఫైన‌ల్ వ‌ర‌కూ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కొంత‌మంది ర‌న్న‌ర్ లుగా నిల‌వ‌గా మ‌రికొంత మంది టాప్ 3లో ఉన్న‌వాళ్లు ఉన్నారు. ఇక ఈ వార్త‌లే నిజం అయితే మాజీల మ‌ధ్య బిగ్ బాస్ ఓటిటి పోటీ ఏవిధంగా ఉంటుందో చూడాలి.

Visitors Are Also Reading