సినిమా పూర్తిగా ప్రేక్షకులకు నచ్చితేనా ఆ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ ఆ సినిమా పై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. థియేటర్ నుండి బయటకు వెళ్లే ప్రేక్షకుడు క్లైమాక్స్ నే ఎక్కువ గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి క్లైమాక్స్ ప్రేక్షకుడికి నచ్చకపోతే సినిమానే ఫ్లాప్ అవుతుంది. అలా టాలీవుడ్ లో కొన్ని సినిమాలు క్లైమాక్స్ మెప్పించకపోవడంతో ఫ్లాప్ అయ్యాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం…
Advertisement
నాగచైతన్య సాయిపల్లవి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా ఫస్ట్ ఆఫ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెకండ్ ఆఫ్ కూడా ప్రేక్షకులకు నచ్చింది కానీ సినిమా క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకోకపోవడంతో నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
రానా కాజల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. సినిమా మొత్తం ప్రేక్షకుడికి నచ్చింది కానీ క్లైమాక్స్ మాత్రం నచ్చకపోవడంతో సినిమాకు నెగిటివ్ టాక్ మొదలయ్యింది.
Advertisement
Also Read: బాలయ్య రెండో కుమార్తె తేజస్విని ఎక్కడ ఉంటారు…? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ఎన్నో అంచనాల మధ్యన విడుదలైంది. సినిమా మొత్తం ఓ రేంజ్ ఉండగా క్లైమాక్స్ మాత్రం చాలా వీక్ గా ఉంటుంది. దాంతో సినిమాకు నెగిటివ్ టాక్ మొదలైంది.
హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన సినిమా పడిపడిలేచె మనసు. ఈ సినిమా లోని పాటలు సీన్లు ప్రేక్షకులకు నచ్చాయి. కానీ క్లైమాక్స్ మాత్రం ఆశించినమేర లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయ్యింది.
రానా హీరోగా నటించిన విరాటపర్వం సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా చివరలో హీరోయిన్ ను హీరో చంపేయడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. దాంతో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ మొదలైంది.
AlSO READ : బాలయ్య రెండో కుమార్తె తేజస్విని ఎక్కడ ఉంటారు…? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..?