Home » Alcohol: మద్యం సేవించేటప్పుడు పొరపాటున కూడా ఈ పదార్థాలు తినకూడదు..!!

Alcohol: మద్యం సేవించేటప్పుడు పొరపాటున కూడా ఈ పదార్థాలు తినకూడదు..!!

by Sravanthi
Ad

సాధారణంగా చాలామందికి మద్యం సేవించే అలవాటు ఉంటుంది. కొంతమందికి మద్యం సేవించనిదే నిద్ర కూడా పట్టదు. అలాంటివారు ప్రతిరోజు మద్యం తాగుతూ మద్యంలోకి మంచింగ్ గా వివిధ ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. మరి మద్యం తాగుతూ అలా ఆహార పదార్థాలను తినడం మంచిదేనా? మద్యం సేవిస్తూ ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి?ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మద్యం సేవిస్తూ కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

also read:Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి

సాధారణంగా చాలామంది మద్యం తాగేటప్పుడు వేరుశెనగ లేదా జీడిపప్పును తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే మద్యం సేవించే సమయంలో ఈ పదార్థాలను దూరం పెట్టాలని నిపుణులు అంటున్నారు.. ఇవి తినడం వల్ల శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వారు అంటున్నారు. అంతేకాకుండా మద్యం సేవించే సమయంలో తీపి పదార్థాలను కూడా దూరం పెట్టాలని, సోడా కూల్ డ్రింక్ వంటివి కలుపుకొని తాగితే నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Advertisement

మద్యంతో పాటుగా నూనె తో తయారుచేసిన ఆహార పదార్థాలు తింటే గ్యాస్ అధికమై ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు. అంతేకాకుండా చిప్స్ , పాలతో తయారుచేసిన ఆహార పదార్థాలు తినకూడదట. ఈ ఆహార పదార్థాలు తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఏర్పడి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా గుండెపోటు త్వరగా వచ్చే అవకాశం ఉంటుందని వారు తెలియజేస్తున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే మద్యం సేవించకపోవడం ఉత్తమమని నిపుణులు తెలియజేస్తున్నారు.

also read:

Visitors Are Also Reading