తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోల గురించి చెప్పాలంటే మొట్టమొదట మనకి ఎన్టీఆర్ గుర్తొస్తారు. ఎన్టీఆర్ పౌరాణిక, జానపద, ఫాంటసీ, సాంఘిక ఇటువంటి పాత్రలు చేస్తూ అందరిని మెప్పించారు. ఏ పౌరాణిక పాత్ర వేసినా అందులో పరకాయ ప్రవేశం చేయడం ఎన్టీఆర్ ప్రత్యేకత పాతాళభైరవి మూవీలో మామూలు తోటరాముడుగా కూడా కనపడి అదరగొట్టారు. గుండమ్మ కథ, మాయాబజార్ ఇటువంటి క్లాసికల్ సినిమాల్లో కూడా ఆయన నెక్స్ట్ లెవెల్లో చూశారు. ఏ హీరోకి రానంత పాపులారిటీని తెచ్చుకున్నారు. చాలా సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని షేర్ చేసేసారు.
Advertisement
ఈ లెజెండ్ యాక్టర్ టైం లో ఏఎన్ఆర్ శోభన్ బాబు సూపర్ స్టార్ కృష్ణ కాంతారావు వంటి వాళ్ళు రాణించారు. ఎన్టీఆర్ ని మాత్రం ఎవ్వరు కూడా బీట్ చేయలేకపోయారు. ఎన్టీఆర్ తర్వాత మళ్లీ అంతటి పేరు తెచ్చుకున్నది చిరంజీవి అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ తరం ముగిసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బ్రేక్ డాన్సులు ఇంటెన్స్ ఫైట్లు మాస్ డైలాగ్ తో అదరగొట్టేశారు. స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ చిరంజీవికి ముందు చిరంజీవి తర్వాత అనే విధంగా మారింది.
Advertisement
Also read:
‘
Also read:
ఖైదీ, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి గొప్ప హీరోగా మారిపోయారు. టాలీవుడ్ సెకండ్ జనరేషన్ టైం లో చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ బానే పోటీపడ్డారు. చిరంజీవి రేంజ్ లో మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం సాధించలేదు. మెగాస్టార్ లాగ ఎక్కువగా బిగ్గెస్ట్ హిట్స్ వాళ్లు కొట్టలేకపోయారు. మెగాస్టార్, చిరంజీవి తరం ముగిసిపోయిన తర్వాత రామ్ చరణ్ ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లు అర్జున్ ప్రభాస్ దూసుకు వెళ్ళిపోతున్నారు. పెద్ద పెద్ద హిట్లతో రికార్డులని కొల్లగొడుతున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!