Chankya Niti Telugu: ఆచార్య చాణక్య విధానాలు అమూల్యమైన ఆలోచనలు ఆనాడు చెప్పినా.. నేడు కూడా సరిపోయే విధంగా ఉన్నాయి. ఈ విధానాలు భావి తరాలకు స్పూర్తిదాయకంగా నిలిచాయి. ఈ జీవిన విధానాలను అనుసరించడం ద్వారా వారి జీవితం సంతోషంగా గడుస్తుంది. ఆచార్య చాణక్య మానవులలోని అనేక దుర్గుణాల గురించి కూడా తెలిపారు. ఈ లోపాలు కలిగిన వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. ఎప్పటికీ విజయం సాధించలేరు. జీవితంలో విజయం సాధించాలనుకునేవారు గుర్తుంచుకోవాల్సిన ఐదు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ముఖ్యంగా ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం.. అత్యాశ అనేది మనుషులలో ఉండే పెద్ద లోపం. అత్యాశ అనేది ఒక బీజం. దాని నుంచి అనేక దుర్గుణాలు పుడతాయి. అత్యాశగల మనిషిని అస్సలు నమ్మలేం. అత్యాశపరులకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్య తెలిపారు.
Also Read: శ్రీదేవి విషయంలో ఎన్టీఆర్ ఎందుకు అలా చేసారు ? దానివెనుకున్న కారణమేంటి ?
Advertisement
అదాతృత్వాన్ని పెంపొందించుకుంటూ మీరు అత్యాశను విడిచిపెట్టి దాతృత్వాన్ని పెంపొందించుకునే దిశగా అడుగులు వేస్తే మీరు చాలా ఇబ్బందుల నుంచి బయటపడతారు. నిరంతరం స్వప్రయోజనం గురించి చింతించకుండా మీకు సాయం చేసిన వ్యక్తి గురించి కూడా ఆలోచించండి. వారిలోని దాతృత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఆదిశగా అడుగులు వేయండి.
మీ కోసం మాత్రమే జీవికండి. మీ జీవితంలో ఏదో ఒక సమయంలో మిమ్మల్ని ఆదుకున్న వారుంటారు. దానిని గుర్తుంచుకుని మీ సాయాన్ని కోరిన వ్యక్తికి సాయం చేయగలరేమో ఆలోచించండి. ఇలా చేయడం ద్వారా మీరు ఇతరులకు సాయం చేయడలంలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారు. అప్పుడు అత్యాశను విడిచిపెట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది.
ముఖ్యంగా మీ సన్నిహితుల కోసం ఆలోచించండి. అత్యాశ అనేది మిమ్మల్ని, మీ సన్నిహితుల నుంచి దూరం చేస్తుంది. మీరు ఎంతో సమర్థులైనప్పటికీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సాయం చేయనప్పుడు, వారు చాలా బాధపడతారు. మీతో సంబంధాన్ని తెంచుకుంటారు. జీవితంలో మీకు ఇబ్బందులు ఎదురైనప్పుడు వారు మిమ్మల్ని ఆదుకునేందుకు ముందుకు రారు.
Also Read: నాగచైతన్య వదులుకున్న 5 సూపర్ హిట్ సినిమాలు ఇవే..!