సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. సినిమాకు దర్శకుడే వెన్నుముక కాబట్టి 24 క్రాఫ్ట్స్ ను మ్యానేజ్ చేయగల దమ్ముండాలి. నిద్రను సైతం మర్చిపోయి రేయింబవళ్లు కష్టపడి పనిచేయాలి. అలా ఎంతో కష్టపడి చేసిన సినిమా ప్రేక్షకులకు నచ్చితేనే హిట్ పడుతుంది… లేదంటే ఫట్టే…కానీ కొంత మంది దర్శకులకు ఇప్పటి వరకూ ఫ్లాప్ అంటేనే తెలియదు. ఆ టాలెంటెడ్ దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం….
Advertisement
స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రాజమౌళి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ తో వీదేశాల్లో సైతం జక్కన్న సత్తా చాటాడు. ఇక జక్కన్న కెరీర్ లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ గానే నిలిచాయి.
కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా రేంజ్ లో నిలబెట్టిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ కెరీర్ లోనూ ఫ్లాప్ పడలేదు. కేజీఎఫ్ తో సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరవాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు.
Advertisement
తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీకి కూడా ఫ్లాప్ రుచి ఎరగదు. ఇప్పటి వరకూ అట్లీ తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్ గానే నిలిచాయి. అట్లీ దర్శకత్వంలో వచ్చిన రాజారాణి సినిమా టాలీవుడ్ ప్రేక్షకులుకు ఎంతగానో నచ్చింది.
దర్శకుడు లోకేష్ కనకరాజ్ కత్తి సినిమాతో సత్తా చాటాడు. రీసెంట్ గా కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. వరుసగా స్టార్ హీరోలతో చేసే అవకాశాలు అందుకుంటున్నాడు.
బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానికి కూడా ఫ్లాప్ అంటే తెలియదు. పీకే, త్రీ ఇడియల్స్ లాంటి చిత్రాలతో రాజ్ కుమార్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.
దర్శకుడు అనిల్ రావిపూడి వరుస సూపర్ హిట్ లతో దూసుకుపోతున్నాడు. అనిల్ దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. తన తరవాత సినిమాను అనిల్ బాలయ్య బాబుతో తెరకెక్కిస్తున్నాడు.
నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రమణ్యం సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మహానటి లాంటి ఎపిక్ తీసి జానాలను ఆకట్టకున్నాడు. ఇప్పటి వరకూ నాగ్ అశ్విన్ కెరీర్ లో కూడా ఫ్లాప్ లు లేవు.
ALSO READ : LAAL SINGH CHADDA REVIEW : “లాల్ సింగ్ చడ్డా” సినిమా రివ్యూ ..!