Home » LAAL SINGH CHADDA REVIEW : “లాల్ సింగ్ చ‌డ్డా” సినిమా రివ్యూ ..!

LAAL SINGH CHADDA REVIEW : “లాల్ సింగ్ చ‌డ్డా” సినిమా రివ్యూ ..!

by AJAY
Ad

ప‌రిచ‌యం :

LAAL SINGH CHADDA REVIEW: ప్ర‌స్తుతం బాలీవుడ్ టాలీవుడ్ అనే భేదం లేకుండా పోయింది. ఏ భాష‌లో సినిమా వ‌చ్చినా పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల‌వుతూ మంచి క‌లెక్ష‌న్స్ ను రాబ‌డుతున్నాయి. దాంతో తెలుగు స్టార్స్ కు కూడా ఇత‌ర భాషీయ చిత్రాల‌లో అవ‌కాశాలు అందుకుంటున్నారు. తాజాగా నాగ‌చైత‌న్య ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించిన బాలీవుడ్ చిత్రం లాల్ సింగ్ చ‌ద్దా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాలో అమీర్ ఖాన్ హీరోగా న‌టించగా క‌రీనా క‌పూర్, మోనా సింగ్ లు హీరోయిన్ లుగా న‌టించారు. అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాకు ప్రీత‌మ్ స్వరాలు స‌మ‌కూర్చారు. ఇక ఈ సినిమాలో చైతూ కూడా న‌టించ‌డంతో టాలీవుడ్ ప్రేక్ష‌కులుకు ఆస‌క్తి పెరిగింది. అంతే కాకుండా నాగార్జున‌, చిరంజీవి సినిమా ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన్నారు. అలా ఎన్నో అంచనాల మ‌ధ్య లాల్ సింగ్ చ‌డ్డా నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ సినిమా ఆ అంచ‌నాల‌ను రీచ్ అయ్యిందా లేదా ఇప్పుడు చూద్దాం….

Advertisement

Also Read:  బాల‌య్య రెండో కుమార్తె తేజ‌స్విని ఎక్కడ ఉంటారు…? ప్ర‌స్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..?

LAAL SINGH CHADDA REVIEW

LAAL SINGH CHADDA REVIEW

క‌థ &క‌థ‌నం :

ఈ సినిమా 1994 లో వ‌చ్చిన ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్ గా వ‌చ్చింది. అప్ప‌ట్లో ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఆ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇప్ప‌టి ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గిన‌ట్టుగా లాల్ సింగ్ చ‌డ్డా సినిమాను తెరరెక్కించారు. అంగ‌వైక‌ల్యంతో బాధ‌ప‌డుతున్న పిల్లాడు త‌న త‌ల్లి స‌హ‌కారం ప్రోత్సాహంతో ఆర్మీలోకి వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. ఆ త‌ర‌వాత అత‌డు ఆర్మీలోకి వెళ్ల‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డ్డాడు..?

Advertisement

Also Read:   బాల‌య్య రెండో కుమార్తె తేజ‌స్విని ఎక్కడ ఉంటారు…? ప్ర‌స్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..?

ఆర్మీలో చేరిన త‌ర‌వాత రాష్ట్ర‌ప‌తి నుండి మెడ‌ల్ అందుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అన్న‌దే ఈ సినిమా క‌థ‌. అమీర్ ఖాన్ ఎక్కువ ప్ర‌మోగాత్మ‌క సినిమాల్లో న‌టిస్తుంటాడు. అంతే కాకుండా బ‌ల‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటాడు.ఈ సినిమా కూడా అలాంటిదే. సినిమా ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ద‌ర్శ‌కుడు ఆర్మీ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమా అయిన‌ప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌డా బోర్ కొట్ట‌నివ్వ‌కుండా క‌థ‌ను ముందుకు న‌డిపించాడు.

అమీర్ ఖాన్ త‌న న‌ట‌న‌తో మ‌రోసారి మెప్పించ‌గ‌లిగాడు. క‌రీనా క‌పూర్, చైతూ కూడా త‌మ పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్నారు. చైతూకు ఇది మంచి బాలీవుడ్ ఎంట్రీ అనే చెప్పాలి. టెక్నిక‌ల్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఈ సినిమాను కుటుంబంతో క‌లిసి ఖ‌చ్చితంగా థియేట‌ర్ ల‌లో చూడ‌వచ్చు. సినిమాటోగ్ర‌ఫి బాగుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇకాస్త మెరుగ్గా ఉండాల్సింది అనిపిస్తుంది.

Also Read:    ఐర‌న్ లెగ్ అనుకుంటే గోల్డెన్ లెగ్ అయ్యింది…! శృతిహాస‌న్ బ్రేక్ ఇచ్చిన 7 గురు స్టార్స్ వీళ్లే…!

Visitors Are Also Reading