Home » పునీత్ నుండి తారకరత్న వరకు… ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలు వీరే!

పునీత్ నుండి తారకరత్న వరకు… ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలు వీరే!

by Bunty
Ad

నందమూరి తారకరత్న 40 ఏళ్ల వయసులోనే హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27న కుప్పంలో పాదయాత్ర ప్రారంభించగా, మొదటిరోజు తారకరత్న కూడా పాల్గొన్నారు. లోకేష్ తో కలిసి నడిచారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. అయితే, ఈ తరహాలో గుండెపోటుతో మరణించిన తారలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Advertisement

పునీత్ రాజ్ కుమార్, (2021 అక్టోబర్ 29) కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో కసరత్తు పూర్తి చేసిన తర్వాత ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ తో కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించేలోపే తుదిశ్వాస వదిలారు. 46 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు.

సింగర్ కేకే (2022 మే 31) ప్రముఖ గాయకుడు కేక 53 ఏళ్ల వయసులో హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. కోల్కత్తాలోని ఓ కాలేజీ ఫెస్ట్ లో ప్రదర్శన ఇస్తుండగా ఉన్నట్టుండి కేకే కుప్పకూలారు. నిర్వాహకులు ఆసుపత్రికి తరలించేలోపే ఆయన తుదిశ్వాస వదిలారు.

Advertisement

సిద్ధార్థ్ శుక్ల (2021 సెప్టెంబర్ 2) బాలిక వధు, బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకుల మన్ననలు చూరగోన్న నటుడు సిద్ధార్థ్ శుక్లా 40 ఏళ్లకే హార్ట్ ఎటాక్ తో తుదిశ్వాస వదిలారు.

puneeth rajkumar gowtham reddy

మేకపాటి గౌతమ్ రెడ్డి (2022 ఫిబ్రవరి 21) ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి 49 ఏళ్ల వయసులోనే హఠాన్మరణం పాలయ్యారు. నిత్యం జిమ్ లో వర్కౌట్ చేసే గౌతమ్ రెడ్డి కూడా గుండెపోటుతో చనిపోయారు.

సిద్ధాంత్ వీర్ సూర్య వంశీ (2022 నవంబర్ 11) ప్రముఖ టీవీనటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ 46 ఏళ్ల వయసులో కన్నుమూశారు. జిమ్ లో వ్యాయామం చేస్తూ చేస్తూనే కుప్పకూలారు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించిన ఉపయోగం లేకుండా పోయింది.

రాజు శ్రీ వాత్సవ (2022 సెప్టెంబర్ 21) ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ ద్వారా గుర్తింపు పొందిన స్టాండప్ కమెడియన్ రాజు శ్రీ వాత్సవ కూడా చిన్న వయసులోనే మరణించారు. జిమ్ లో వర్క్ అవుట్ చేస్తుండగా శ్రీ వాత్సవ గుండెపోటుకు గురయ్యారు.

READ ALSO : ఆ కారణాలవల్లే… తారకరత్న పెద్ద స్టార్ కాలేకపోయారా?

Visitors Are Also Reading