సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో ఉంది. వరుసగా హిట్ సినిమాలతో ఆయన దూసుకెళ్లుతున్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలను చేసారు. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు మహేష్. పొలిటికల్ ఎలిమెంట్స్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాకు కూడా కమిట్ అయ్యాడు. మహేష్ తొలి సినిమా రాజకుమారుడుతో హీరోగా మారి తన కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలను చేసాడు.
Advertisement
ఇందులో హిట్ సినిమాలున్నాయి. కొన్ని ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఏ హీరో అయినా సినిమా చేస్తున్నప్పుడు అది ప్లాప్ అవుతుందని తెలుస్తే మాత్రం అసలు చేయడు. కొన్ని సినిమాలు చేస్తున్న సమయంలో ఆ ఫలితం తేడా కొట్టేస్తుందని అర్థమవుతుంది. అప్పడు ఆ సినిమా వదల్లేని పరిస్థితి నెలకొంటుంది. అయిష్టంగానే ఆ సినిమాను పూర్తి చేస్తారు. సినిమా చేస్తున్న సమయంలో ప్లాప్ అవుతాయని తెలిసిన సినిమాలు మహేష్ కెరీర్లో రెండు ఉన్నాయట. ఆ రెండు ఒకటి బ్రహ్మోత్సవం, మరొకటి స్పైడర్ కావడం విశేషం.
Advertisement
సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు సినిమా ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో మహేష్ బ్రహ్మోత్సవం సినిమా చేశాడు. శ్రీమంతుడు షూటింగ్ సమయంలోనే క్లైమాక్స్‌లో ఉండగా.. ఫ్యామిలీ స్టోరీ అని ఒక్క మాట చెప్పిన వెంటనే శ్రీకాంత్‌పై నమ్మకంతో ఒకే చెప్పేశాడు మహేష్. అయితే ఆ సినిమా సగం పూర్తి అయిన తరువాత ఏ సీన్ ఎలా తీస్తున్నారో కూడా అర్థం కావడం లేదట. అప్పుడు కానీ ఆ స్కిప్ట్ర్ పూర్తి కాలేదన్న విషయం మహేష్‌కు తెలిసిందట.
మరొకవైపు మురగదాస్‌కు అభిమానిగా ఉన్న మహేష్ ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ముందు నుంచే అనుకున్నాడు. మురగదాస్ సినిమా చేద్దాం అని చెప్పిన వెంటనే కథ కూడా వినకుండా ఓకే చెప్పేశాడు. ఆ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేసారు. ఆ సినిమా షూటింగ్ సగం పూర్తి అయిన తరువాత మహేష్‌కు ఫలితం తేడా కొట్టేసినట్టు క్లారిటీ వచ్చేసిందట. చేయడానికి ఏమి లేకపోవడంతో పూర్తి చేశాడు. మహేష్ అనుకున్నట్టుగానే స్పైడర్ ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. అలా ఈ రెండు సినిమాల ఫలితం మహేష్‌కు ముందే తెలిసినా చేసేది ఏమి లేక పోవడంతో అయిష్టంగానే పూర్తి చేశారు. అలా ఆ రెండు సినిమాలు డిజాస్టరయ్యాయి.