IMDB (ఇంటర్నెట్ డేటాబేస్)కి సంబంధించిన వారు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైనటువంటి ప్రతి సినిమాతో వెబ్ సిరీస్‌లకు ప్రేక్షకుల స్పందనను బట్టి రేటింగ్ ఇస్తుంటారు. 2022లో ఇప్పటివరకు మనదేశంలో విడుదలైన వివిధ భాషలకు సంబంధించిన చిత్రాల్లో దక్షిణాది నుంచి ఆర్ఆర్ఆర్, విక్రమ్, కేజీఎప్-2 సినిమాలు టాప్-10లో ఉన్నాయి. ఇక IMDB జాబితాలో ఏయే సినిమాలు ఎంత రేటింగ్ సాధించాయో ఇప్పుడు మనం చూద్దాం.
విక్రమ్ :
Advertisement
కమల్ హాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విక్రమ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. కమల్ హాసన్ హీరోగా స్టామినా ఏంటో చూపించింది. తాజాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.415 పైగా గ్రాస్ వసూళ్లను క్రాస్ చేసింది. IMDB రేటింగ్‌లో ఈ చిత్రం 8.8 రేటింత్‌తో 2022లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో నెంబర్ వన్‌గా నిలిచింది విక్రమ్.
KGF Chapter -2 :
కేజీఎఫ్‌తో రికార్డును బ్రేక్ చేసిన యశ్ ఇప్పుడు కేజీఎఫ్ 2 మూవీతో పలకరించిన విషయం విధితమే. భారీ అంచనాల మద్య ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1233 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఈ ఏడాది అత్యధిక వసూళ్లతో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. IMDB రేటింగ్‌లో 8.8 రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది.
The Kashmir Files :
ది కశ్మీర్ ఫైల్స్ చిన్న సినిమాగానే విడుదలైనప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిందనే చెప్పవచ్చు. 1990లో కశ్మీర్ ప్రాంతం నుంచి అక్కడ పాకిస్తాన్ ప్రేరేపిత ముస్లిం నుంచి వెళ్లగొట్టిన కశ్మీరీ పండితుల దీనగాథను తెరకెక్కించారు. దాదాపు రూ.15కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా రూ.340 కోట్లను వసూలు చేసి ఔరా అనిపించింది. తాజాగా IMDB రేటింగ్‌లో 8.3 రేటింగ్స్‌తో మూడవ స్థానంలో నిలిచింది.
హృదయం :
2022లో విడుదలైన భారతీయ చిత్రాల్లో మలయాళ చిత్రం హృదయం. న్యూ ఏజ్ డ్రామాగా ముఖ్యంగా ఓ వర్గం ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఈ సినిమా అనూహ్యంగా IMDB రేటింగ్‌లో 8.1 సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.
RRR :
Advertisement
2022లో ఆర్ఆర్ఆర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా నటించారు. ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. రెండు వారాలలోపు 1000 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.1150.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. IMDB రేటింగ్ లిస్ట్‌లో 8.0 రేటింగ్ తో 5వ స్థానంలో నిలిచింది.
Thurs day :
యామీ గౌతమ్, అతుల్ కులకర్ణి ముఖ్యపాత్రలో నటించిన సినిమా ఏ థర్స్ డే ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా విడుదలై మంచి రెస్పాన్స్ నే తెచ్చుకుంది. ఈ చిత్రం IMDB రేటింగ్ లిస్ట్‌లో7.8 రేటింగ్స్ సాధించి 6వ స్థానంలో నిలిచింది.
జుండ్ :
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన మూవీ జుండ్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచిననప్పటికీ IMDB రేటింగ్ లిస్ట్‌లో7.4 సాధించి ఏడో స్థానంలో నిలిచింది.
Runway 34 :
బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ నటిస్తూ.. నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం రన్ వే 34. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది. ఏప్రిల్ 29న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే IMDB రేటింగ్స్‌లో ఈ సినిమా 7.2 రేటింగ్ సాధించి 8వ స్థానంలో నిలిచింది.
Samrat Prithviraj :
బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో అదురగొడుతున్నారు. ఈ కోవలో ఈయన మొదటిసారి చారిత్రక పాత్రలో నటించిన సినిమా సమ్రాట్ పృథ్వీరాజ్ సినిమాకు టాక్ బాగున్నప్పటికీ అందుకు తగ్గట్టు వసూళ్లను రాబట్టలేకపోయింది. కానీ IMDB రేటింగ్స్‌లో 7.2 రేటింగ్ సాధించి టాప్-9లో నిలిచింది.
గంగుబాయి కతియావాడి :
సంజయ్ లీలా భన్సాలీ దర్శక, నిర్మాణంలో ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్ ముఖ్యపాత్రల్లో నటించిన మూవీ గంగుబాయ్ కతియా వాడి సినిమా ఫిబ్రవరి 25న విడుదలై బాలీవుడ్‌లో తొలి హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం IMDB రేటింగ్స్‌లో 7.0 రేటింగ్స్ సాధించి టాప్-10లో నిలిచింది.
Also Read :
సినీ నటి మీనా విద్యాసాగర్ పెళ్లి రోజున మీన ఎమోషనల్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్
జబర్దస్త్‌లో లొల్లి.. అసలు ఎవరు ఏం అన్నారు..?