వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన తరుచూ ఇబ్బంది పడుతుంటారు. దోమల వల్ల వచ్చే చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వస్తుంటాయి. ముఖ్యంగా శిశువులు, చిన్నపిల్లలు ఎక్కువగా ఈ వ్యాధుల బారిన పడుతుంటారు. చిన్నారులు తమంతట తాము దోమలకాటు నుంచి తమని తాము రక్షించుకోలేరు. వర్షాకాలంలో పిల్లల కోసం ఆట స్థలాన్ని ఎన్నుకునేటప్పుడు ఇండోర్ కేర్ తీసుకునేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. సాధారణంగా పిల్లల్లో చర్మంపై కనిపించవచ్చు. దురద కారణంగా అసౌకర్యంగా అనిపించే వరకుగమనించకపోవచ్చు.
ముఖ్యంగా పిల్లల్లో దోమ కుట్టిన తరువాత ఒక చిన్న ఎర్రని బంప్ ఏర్పడుతుంది. ఆ తరువాత నొప్పి, దురద వస్తుంది. దద్దురు ముగ్గురు రంగులోకి మారుతుంది. కాల క్రమేణా గట్టిగా మారుతుంది. కీటకాలు కాటు దోమకాటు మాదిరిగానే కనిపిస్తాయి. ఎర్రటి గడ్డ లేదా దురద దోమకాటు లేదా మరో కీటకం వల్ల సంభవించిందో లేదో తెలియదు. జాగ్రత్త ఉండాలి. దోమ కుట్టినప్పుడే పిల్లల్లో చాలా సార్లు దద్దుర్లుతో పాటు గడ్డలా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో శరీరం వాపు వంటి లక్షణాలను గమనించవచ్చు. శిశువుకు, తల్లిదండ్రులకు చికాకు కలిగిస్తుంది. శిశువులు, చిన్న పిల్లలకు దోమలు కుట్టినప్పుడు ఆ ప్రదేశంలో గోకడం ఆపడం చాలా కష్టం. ఇలా చేయడం వల్ల గీతలు, చర్మంపై ర్యాషెస్ వంటివి ఏర్పడుతుంటాయి. నివారణ చర్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Advertisement
- దోమలు నివాసముండే నీటి చెరువులు, తోటలు, ఇతర ఆట స్థలాలు వంటి ప్రాంతాలకు పిల్లలను పంపడం మానుకోండి.
- తలుపులు, కిటికీలను తగిన సమయంలో మూసేయడం ద్వారా మీ ఇంటి నుంచి దోమలు, కీటకాల నుంచి రక్షించుకోండి.
- చేతులు పూర్తిగా కవర్ చేసుకునే విధంగా టాప్‌లు షర్టులు, పుల్ ఫ్యాంట్‌లు లేదా లెగ్గింగ్‌ల వంటి తగిన దుస్తులు ధరించండి.
- పిల్లలను ఆరు బయటికి పంపే ముందు లేదా ఇంట్లో ఉండే ముందు తగిన మొత్తంలో క్రీమ్స్ రాయండి.
- పిల్లలు నిద్రించే సమయంలో దోమలను దూరంగా ఉంచడానికి దోమతెరను రాయండి.
- పిల్లలు నిద్రించే సమయంలో దోమలను దూరంగా ఉంచడానికి దోమతెరను ఉపయోగించండి.
- ఇంటి తలుపులు కిటికీలకు దోమలు రాకుండా వలలు అమర్చవచ్చు. ముఖ్యంగా మీరు సాయంత్రం కిటికీలు తెరిచి ఉంచాలని ప్లాన్ చేస్తే మీ పిల్లలను బయటికి వెళ్లనివ్వకుండా జాగ్రత్త వహించండి.
- బయట తింటున్నట్టయితే రాత్రిపూట బహిరంగ రెస్టారెంట్లను నివారించండి. దోమకాటుకు తక్కువ అవకాశమున్న హోటల్, రెస్టారెంట్‌లకు వెళ్లండి ఉత్తమం.
ఇది కూడా చదవండి : లవంగాల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు తినకుండా ఉండరు..!