Home » జ‌యం నుంచి ఉప్పెన వ‌ర‌కు తొలి మూవీతోనే హిట్ సాధించిన తెలుగు హీరోలు వీరే..!

జ‌యం నుంచి ఉప్పెన వ‌ర‌కు తొలి మూవీతోనే హిట్ సాధించిన తెలుగు హీరోలు వీరే..!

by Anji
Ad

తెలుగు ఇండస్ట్రీ లో కొందరు హీరోలు తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న వారు ఉన్నారు. కొందరు హీరోలుతొలినిమాతోనే హిట్ సాధించారు. అలా హిట్ కొట్టడం అంటే మామూలు విష‌యం కాదు.. దానికి చాలా అదృష్టం కావాలి. టాలెంట్ ఒక్క‌టి ఉన్నా కూడా ఒక్కోసారి విజయం చిన్నచూపు చూస్తుంది. అదే తొలి సినిమా హిట్ అయిందంటే పునాది బాగా పడుతుంది. అలా తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి హిట్ సినిమాలతో నిలిచిన‌ హీరోలు చాలా తక్కువగా ఉన్నారు. మరి ఎలాంటి హీరోలెవరు.. ఎంతమంది ఉన్నారు..? వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అటు జయం మూవీ తో నితిన్ కూడా జయభేరి ని మోగించారు. ఈ కోవలో సూపర్ హిట్ అందుకున్న హీరోలు ఎవరు ఉన్నారో చూద్దాం.


వైష్ణవ్ తేజ్- ఉప్పెన:

Advertisement

 

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, మెగాస్టార్ మేనల్లుడు గా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్.. తొలి సినిమా ఉప్పెన తో సంచలనం సృష్టించాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన చిత్రం రూ. 51 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తంగా తొలి సినిమాతో ఈ మూవీ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. ఈ మూవీ రూ. 20.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. రూ. 31.02 కోట్ల లాభాలను తీసుకురావ‌డం విశేషం. ఈ ఏడాది నిర్మాతగా అత్యధిక లాభాలు తీసుకొచ్చిన రెండవ‌ చిత్రంగా నిలిచింది. ఓ రకంగా చెప్పాలంటే పెట్టిన పెట్టుబడికి వచ్చిన లాభాలు చూసుకుంటే.. మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా నిలిచింది ఉప్పెన‌. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న హీరోల్లో ఒకడిగా నిలిచారు వైష్ణ‌వ్ తేజ్‌.

విజయ్ దేవరకొండ:

u=4u=రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన నువ్విలా” సినిమాలో చిన్న పాత్రలో మెరిసారు విజయ్ దేవరకొండ. ఇక ఆ తర్వాత శేఖర్ 3కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫుల్ చిత్రం లో కూడా అంతగా ప్రాధాన్యత లేని పాత్రలోనే నటించారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్, ఎవడే సుబ్రహ్మణ్యం, సినిమాలో ఋుషి పాత్ర విజయ్ దేవరకొండ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక సోలో హీరోగా విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో పెళ్లిచూపులు సినిమా చేశారు. ఈ సినిమా విడుదల త‌రువాత ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో ఇక అంద‌రికీ తెలిసిందే.

సాయి ధరమ్ తేజ్

పి23ల్లా నువ్వు లేని జీవితం.. A.S. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తో సాయి ధరమ్ తేజ్ మొద‌టి మూవీ తోనే సూపర్ హిట్ అందుకున్నాడు.

 

రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల :

విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఉయ్యాల జంపాల సినిమాతో సూప‌ర్‌ హిట్ అందుకున్నాడు రాజ్ తరుణ్.

నాని: అష్టా చమ్మా

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అష్టాచమ్మా సినిమాతో హీరో నాని తొలి సక్సెస్ సాదించారు.

లీడర్: రానా

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ మూవీ తో హీరోగా సక్సెస్ అందుకున్నారు రానా దగ్గుబాటి. ఈ సినిమాలో రానా ముఖ్యమంత్రి పాత్రలో నటించారు.

రామ్ చరణ్: చిరుత/

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిరుత మూవీ తో మెగా తనయుడు రామ్చరణ్ హీరోగా పరిచయమయ్యాడు. అంతేకాదు ఫస్ట్ మూవీతోనే మెగా హిట్.

రామ్ పోతినేని: దేవదాస్ :

Advertisement

తెలుగులో ఎనర్జిటిక్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్. వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన రామ్.. మొదటి సినిమాతోనే డాన్సులు, ఫైట్స్, నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాతో హీరోయిన్ గా ఇలియానా వెండితెరకు పరిచయం అయింది.

అల్లు అర్జున్: గంగోత్రి

హీరోగా గంగోత్రి మూవీ తో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు అల్లు అర్జున్. ముఖ్యంగా ఎవరి కుర్రాడు ఇలా ఉన్నాడు..? బ్యాగ్రౌండ్ ఉంటే ఎలా ఉన్నా హీరో అయిపోవచ్చా..? ప్రేక్షకుల ముందుకు తోసేసి.. వాళ్ల పైకి రుద్దేస్తారా.. అంటూ చాలా విమర్శలు వచ్చాయి .బహుశా తెలుగులో ఏ వారసుడిపై కూడా ఈ స్థాయి విమర్శలు రాలేదు. కానీ అల్లు అర్జున్ పై వచ్చాయి. గంగోత్రి విడుదలైనప్పుడు చాలామంది తిట్టారు కూడా. కానీ అప్పుడు తిట్టిన నోళ్లే ఇప్పుడు ఆ హీరో ని చూసి వావ్ అంటున్నాయి. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది.

నితిన్: జయం

ఈ సినిమా పేరు తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. నితిన్ లాంటి ఎనర్జిటిక్ హీరో ను పరిచయం చేసిన సినిమా ఇదే. అప్పటికి సూపర్ ఫామ్ లో ఉన్న దర్శకుడు తేజ. నితిన్ ను జయం సినిమాతో పరిచయం చేశాడు. 2002 జూన్ 14 న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఫస్ట్ మూవీతోనే జయం తోనే విజయాన్ని అందుకున్నాడు నితిన్.

ఉదయ్ కిరణ్: చిత్రం

తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ రీమాసేన్ హీరో హీరోయిన్ లుగా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత రామోజీరావు నిర్మించిన చిత్రం సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచ4లన విజయం సాధించింది.

తరుణ్: నువ్వే కావాలి

తరుణ్ హీరోగా త్రివిక్రమ్ మాటల రచయితగా విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ నువ్వే కావాలి తొలి సినిమాతోనే తరుణ్ హీరోగా సక్సెస్ అందుకున్నాడు.

మహేష్ బాబు – రాజకుమారుడు 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం రాజకుమారుడు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదన్ నిర్మించారు. ఇక అప్పటి వరకు బాలనటుడిగా ప్రేక్షకులను మెప్పించిన మహేష్ బాబు ఈ చిత్రంతో పూర్తిస్థాయి హీరోగా మారాడు. తొలి సినిమాతోనే మహేష్ బాబు సూపర్ హిట్ అందుకున్నాడు.

వెంకటేష్: కలియుగ పాండవులు

సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాతో హీరోగా వెంకటేష్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా తో పాటు ఖుష్బూ కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో స్టార్ట్ అయిపోయింది ఖుష్బూ. ఇలా తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న హీరోగా నిలిచాడు.

నాగార్జున: విక్రమ్

1986లో వి.మధుసూదనరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో తెరకెక్కిన విక్రమ్ సినిమాతోనే నాగార్జున హీరోగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే హీరోగా నాగార్జున బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.

 

Visitors Are Also Reading