భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ మరో నాలుగు రోజుల్లోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం భారత్ గడ్డపై వార్మప్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. అక్టోబర్ 5న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ తో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 8న భారత్ తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా పై ఆడనుంది. ఇదిలా ఉంటే.. ప్రపంచ కప్ లో భారత జట్టును ఇప్పటివరకు ఓడించని జట్లు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఇప్పటివరకు 12 వన్డే వరల్డ్ కప్ లు జరిగాయి. అయితే 9 జట్ల పై భారత్ అధిపత్యం చెలాయిస్తోంది. ఇంతకీ ఆ జట్లు ఏవంటే..? పాకిస్తాన్, నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, సమీబియా, యూఏఈ, బెర్ముడా, తూర్పు ఆఫ్రికా జట్లు ఇప్పటివరకు ప్రపంచ కప్ లో భారత్ ను ఓడించలేకపోయాయి. ప్రపంచ కప్ లో భారత్, పాకిస్తాన్ తో ఏడుసార్లు తలబడితే, ఒక్క మ్యాచ్ లలో కూడా భారత్ పై పాకిస్తాన్ పై చేయి సాధించలేకపోయింది. అన్ని మ్యాచ్ లలో కూడా భారత్ గెలిచింది. మొదటి నుంచి ప్రపంచ కప్ లలో పాకిస్తాన్ పై భారత్ అధిపత్యం చెలాయిస్తూనే ఉంది. ఇక మిగతా జట్ల విషయానికి వస్తే.. భారత్, కెన్యా మధ్య 4 ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరిగితే అన్ని మ్యాచ్ లలో భారత్ గెలిచింది.
Advertisement
నెదర్లాండ్స్, ఐర్లాండ్ జట్టులో రెండుసార్లు భారత్ తో తలబడితే, అన్ని మ్యాచ్‌లపై భారత్ పై చేయి సాధించింది. ఆఫ్ఘనిస్తాన్, సమీబియా, తూర్పు ఆఫ్రికా, బెర్ముడా జట్లు ప్రపంచ కప్ లో భారత్ పై ఒక్కో మ్యాచ్ లో తలపడ్డాయి. ఏ జట్టు కూడా భారత్ ను ఓడించలేకపోయింది. ప్రపంచ కప్ లో భారత్ ను ఓడించిన జట్లు ఇవే. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికా జట్లు కావడం విశేషం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
World Cup 2023 : వరల్డ్ కప్ మ్యాచ్‌లకు భారీ షాక్..రోజూ వర్షాలే ?