సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడానికి చాలా శ్రమిస్తారు. ఇక అవకాశాలు వచ్చాక ఇండస్ట్రీలో మంచి హోదా కలిగిన తరువాత సినిమాల్లో కొన్ని రకాల సీన్లు చేసేందుకు కొందరూ నిరాకరిస్తారు. నేనేంటి అలాంటి సీన్ లో నటించడం ఏంటి..? అని ఫీల్ అవుతూ కొన్ని సన్నివేశాల్లో నటించడానికి ఆసక్తి కనబరచరు. కానీకొంత మంది నటీనటులు మాత్రం సినిమాల కోసం సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టి మరీ పాత్ర కోసం ఎలాంటి పని చేయడానికి అయినా వెనుకాడరు.
టాలీవుడ్ లో కొంతమంది స్టార్ హీరోలు సినిమాలలో ఏకంగా కాళ్లు మొక్కే సీన్లకు ఓకే చెప్పారు. ఒక క్షణం మీరు బాగా గమనిస్తే నిజమే అని మీకు కూడా అనిపిస్తుంది. ఇంతకీ ఆ స్టార్ హీరోలు ఎవరు..? ఏయే సినిమాలల్లో నటించారనే విషయానికి వస్తే.. వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నారప్ప. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో హీరో వెంకటేష్ ఊరి ప్రజల కాళ్లు పట్టుకునే సీన్ ఒకటి ఉంటుంది. అయితే ఆ సీన్ లో నటించేందుకి వెంకటేష్ ఏ మాత్రం అబ్జెక్షన్ చెప్పలేదట. అలాగే డార్లింగ్ ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
ఈ మూవీలో ప్రభాస్ తన ఫ్రెండ్ కోసం నారంగి కాళ్ళను పట్టుకుంటాడు. అయితే ఆ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో పక్కనే ఉన్న ప్రభాస్ డూప్ నేను చేస్తాను అని చెప్పినప్పటికీ.. వద్దు నేనే చేస్తాను అని ఎలాంటి అబ్జెక్షన్ చెప్పకుండా ప్రభాస్ ఆ సన్నివేశంలో నటించాడట. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాలో రజనీకాంత్ కొడుకు పాత్రలో వసంత్ రవి నటించిన విషయం తెలిసిందే. అయితే సినిమాలోని ఒక సన్నివేశంలో కొడుకు షూ పాలిష్ చేసే సీన్ లో రజనీకాంత్ ఎలాంటి అబ్జెక్షన్ చెప్పకుండా నటించారట. ఈ ముగ్గురు స్టార్ హీరోలు వారి సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టి మరీ ఆయా సన్నివేశాలలో నటించడం విశేషం.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!