Home » విక్టరీ వెంకటేష్ మూవీలో హీరోయిన్ గా మరణించిన భామలు వీళ్ళే !

విక్టరీ వెంకటేష్ మూవీలో హీరోయిన్ గా మరణించిన భామలు వీళ్ళే !

by Bunty
Ad

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన సినిమాలతో ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను తన వైపుకు తిప్పుకున్నాడు. వెంకటేష్ సినిమా అంటేనే ఫ్యామిలీ చిత్రం అనే ఒక బ్రాండ్ ని క్రియేట్ చేశాడు. వెంకటేష్ తన కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్లతో నటించాడు.

sridevi

Advertisement

అంతేకాకుండా చాలామందిని తన సినిమాల ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్లుగా పరిచయం చేశాడు. అలా వెంకటేష్ తో కలిసి ఎన్నో మంచి మంచి చిత్రాల్లో నటించిన హీరోయిన్లు కొంతమంది ఇప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

 

# శ్రీదేవి
శ్రీదేవి, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం క్షణక్షణం. ఈ సినిమా ఫలితం కాస్త అటు ఇటుగా ఉండడంతో వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు. ఈ సినిమాతో వెంకటేష్, శ్రీదేవి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారట. ఇక శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించింది.

aarthi-agarwal

# ఆర్తి అగర్వాల్
నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఆర్తి అగర్వాల్. ఈ సినిమాలో వెంకటేష్ ఆర్తి అగర్వాల్ కి ఎంతగానో సపోర్ట్ చేశాడని, యాక్టింగ్ విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా దగ్గరుండి మరి చూసుకునేవాడట. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వీరిద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఆర్తి అగర్వాల్ దురదృష్టవశాత్తు మరణించింది.

# దివ్యభారతి
స్టార్ హీరోయిన్ దివ్యభారతిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది వెంకటేష్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం బొబ్బిలి రాజా. ఈ సినిమాతో దివ్యభారతి స్టార్ హీరోయిన్ గా ఎదగడమే కాకుండా బాలీవుడ్ లో కూడా టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు మరణించింది.

Advertisement

# సౌందర్య
అలనాటి అందాల తార సౌందర్య, వెంకటేష్ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమాలు అంటే అభిమానులకు యమపిచ్చి. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యేవి. అంతేకాకుండా వీరిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉండేదట. ఒకానొక సందర్భంలో వెంకటేష్ సౌందర్యను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఏవో కారణాలవల్ల వీరి వివాహం క్యాన్సిల్ అయింది. ఇక అతి చిన్న వయసులోనే సౌందర్య ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

 

Visitors Are Also Reading