తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండ్ హీరోగా ఎదిగిన చిరంజీవి అంటే నచ్చని వారు ఉండరు. అందరి హీరోల అభిమానులకు చిరంజీవి అంటే చాలా ఇష్టమే. అలాంటి చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ గా ఎదిగారు. ఇప్పటికీ ఏడు పదుల వయసు దగ్గరికి వస్తున్నా కొద్ది ఇంకా సినిమాల్లో జోరు పెంచుతూ ముందుకు కదులుతున్నారు. అలాంటి చిరంజీవి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ “బావగారు బాగున్నారా”. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా మరోసారి సినిమా గురించి కొన్ని ముచ్చట్లు తెలుసుకుందాం.
అయితే నాగబాబుని హీరోగా నిలబెడదామని చిరంజీవి ట్రై చేస్తున్న రోజులవి. కానీ నాగబాబు అంత కటౌట్ ఉన్నా కానీ హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. దీంతో చిరంజీవి తన అంజనా పేరుతో “అంజనా ప్రొడక్షన్స్” సంస్థను స్థాపించి నాగబాబు నిర్మాతగా పరిచయం చేశారు. అలా నాగబాబు నిర్మాణ సారధ్యంలో చిరంజీవి హీరోగా త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, దృద్రవీణ, బావగారు బాగున్నారా, స్టాలిన్ వంటి చిత్రాలు వచ్చాయి. 1998 లో వచ్చిన ఈ బావగారు బాగున్నారా చిత్రం మాత్రమే సూపర్ హిట్ అయింది. మిగతా సినిమాలు మోస్తారు విజయాన్ని సాధించాయి.
జయంతు.సి పరాంజి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్నారట, కానీ అప్పటికే పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉండడంతో చేయలేకపోయారట. అయితే ఈ చిత్రంలో రంభ మరియు రచనను హీరోయిన్లుగా తీసుకున్నారు. 1998 లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మొత్తం 86 కేంద్రాల్లో 50 రోజులు, 54 కేంద్రాల్లో 100 రోజులు ఆడి సూపర్ హిట్ గా నిలిచింది. అలాంటి ఈ చిత్రం విడుదలై ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి గుర్తుకు చేసుకుందాం.