Home » మెగాస్టార్ చిరంజీవి గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగారు. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. చిరంజీవి మెగాస్టార్ గా మారడం వెనుక ఎంతో కష్టం ఉంది. దానిని మాటల్లో వర్ణించడం చాలా కష్టమనే చెప్పాలి. అలాంటి చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

  • చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్.. ఈయన సినిమాల్లోకి రాకముందు ఎన్సీసీ క్యాడేట్ గా  1970 ప్రారంభంలో న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొన్నారు.
  •  గుడిపాటి రాజకుమార్ దర్శకత్వంలో వచ్చిన పునాదిరాళ్లు సినిమా చిరంజీవి కెరీర్ లో మొదటి సినిమా అనుకుంటారు. కానీ చిరంజీవిది ఇది మొదటి సినిమా అది కాదు.  ప్రాణం ఖరీదు ఆయన చేసిన మొదటి చిత్రం.
  • చిరంజీవి అందరికీ హీరో గానే పరిచయం. కానీ మెగాస్టార్ విలన్ పాత్రల్లో కూడా నటించి అదరగొట్టేసారట. కమలహాసన్ హీరోగా ఐ లవ్ యు,  ఇది కథ కాదు, రాణి కాసుల రంగమ్మ, మోసగాడు వంటి చిత్రాలలో విలన్ గా మెప్పించారు.
  • సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి మద్రాస్ ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నారు. ఇద్దరు స్టార్లుగా మారారు. రజనీకాంత్ 1973లో  శిక్షణ పూర్తి చేసుకోగా.. చిరంజీవి 1977లో శిక్షణ పూర్తి చేసుకున్నారు

 

Advertisement

  • చిరంజీవి కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా నటించారు. అప్పట్లో ఎక్కువగా తమిళ ఇండస్ట్రీ వాళ్ళే తెలుగులో నటించేవారు. తెలుగు వాళ్ళు తమిళంలో నటించేవారు కాదు. కానీ చిరంజీవి  47 నాట్కల్, మాప్నీళ, ఎంగల్ స్వామి అయ్యప్పన్, రనువ వీరన్, అంతేకాకుండా హిందీలో ప్రతి బంద్, ది జెంటిల్ మాన్, కన్నడలో సిపాయి, శ్రీ మంజునాథ వంటి సినిమాలు చేశారు.
  • కె విశ్వనాథ్ దర్శకత్వంలో 1987లో వచ్చిన చిరంజీవి మూవీ స్వయంకృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో  ప్రదర్శించబడింది.
  • మెగాస్టార్ చిరంజీవి రుద్రవీణ అనే సినిమాకి సహ నిర్మాతగా కూడా చేశారు. ఈ సినిమా ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుపొందింది.
  • 1992 టైంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఘరానా మొగుడు సినిమా మొదటిసారి 10 కోట్లకు పైగా వసూలు చేసి దక్షిణ భారతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

 ఆ స్టార్ హీరోతో నిత్యామీనన్ డేటింగ్…రహస్యంగా ఇక ఆ పని కూడా…?

శ్రీహరి చనిపోయాక మమ్మల్ని మోసం చేశారు..ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నాం : డిస్కో శాంతి

Visitors Are Also Reading