Home » గాంధీజీ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!

గాంధీజీ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!

by Anji
Ad

భారత జాతిపిత మహాత్మగాంధీ 1869లో అక్టోబర్ 02న గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు. అహింస మార్గాన్ని ఆయుదంగా మార్చుకొని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. భారతదేశంలో ఎంతో మంది స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ అందరికంటే ఎక్కువగా వినిపించే పేరు గాంధీ. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందారు గాంధీ. ఇవాళ గాంధీ 154వ జయంతి సందర్భంగా గాంధీజి గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు కొన్నింటిని మనం తెలుసుకుందాం.

 

Advertisement

Advertisement

  • మహాత్మగాంధీ దాదాపు ఐదు సంవత్సరాల పాటు పండ్లు, గింజలు, నట్స్ మాత్రమే తినేవారట. కొన్ని అనారోగ్య సమస్యలు రావడంతో శాకాహారం మాత్రమే తీసుకోవడం ప్రారంభించారు. ఆహారం విషయంలో దశాబ్దాల పాటు ప్రయోగాలు చేశారు. ది మోరల్ బేసిస్ ఆఫ్ వెజిటేరియనిజం పేరిట ఓ పుస్తకాన్ని రాశారు గాంధీజీ.
  • గాంధీజి దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగి వచ్చిన తరువాత మొదటిసారి చంపారన్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. నీలిమందు రైతుల తరుపున ఆయన పోరాడారు. ఆ సమయంలో రైతులు ఆయనను మహాత్మ అని సంబోధించారు. స్వాతంత్య్ర ఉద్యమానికి ముందే మహిళల హక్కుల కోసం పోరాడారు గాంధీ.
  • గాంధీజీ నిరహార దీక్ష చేస్తున్న సమయంలో ఆయన ఫొటోలను తీయడానికి బ్రిటీష్ ప్రభుత్వం అనుమతించేది కాదు. ఆయన ఫొటోలు బయటికి వెళ్తే.. స్వాతంత్య్ర పోరాటం ఎక్కడ తీవ్రతరమవుతుందనే భయంతో ఫొటోలను అనుమతి ఇచ్చేవారు కాదు.
  • గాంధీజీ తన 13వ ఏటనే వివాహం చేసుకున్నారు. ఆయన కంటే ఏడాది పెద్ద అయిన కస్తూర్భా ను పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యం 62 ఏళ్ల పాటు కొనసాగింది.
  • తొలుత పాల ఉత్పత్తులను మానేయాలని భావించారు. కానీ గాంధీజి ఆరోగ్యం దెబ్బతినడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆ తరువాత మేకపాలు తాగడం ప్రారంభించారు. తాజా మేక పాల కోసం కొన్ని సందర్భాల్లో గాంధీజీ తన ప్రయాణాల్లో కూడా మేకను వెంట తీసుకెళ్లేవారు.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        గాంధీజీ అహింసావాది.. కానీ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున పోరాడటం కోసం ఆయన భారతీయులను ఎంపిక చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ పాల్గొనడాన్ని వ్యతిరేకించారు గాంధీ.
  • గాంధీ భార్య కస్తూర్భా 1944లో ఆగాఖాన్ ప్యాలెస్ నిర్భందంలో ఉండగానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆమె మరణించిన ఫిబ్రవరి 22న భారతదేశంలో మదర్స్ డే గా జరుపుకుంటారు. ఆమె చనిపోయిన సమయంలో గాంధీ జైలులోనే ఉన్నారు. మలేరియా బారిన పడటంతో ఆయన మరణిస్తారనే భయంలో బ్రిటీషు వారు గాంధీజిని జైలు నుంచి వదిలిపెట్టారు.
  • గాంధీ ఇంగ్లాండ్ లో న్యాయ విద్యను అభ్యసించారు. అయితే గాంధీజి చేతి రాత బాగుండదని అక్కడి అధ్యాపకులు పదే పదే చెబుతుండేవారు.
  • జనవరి 30, 1948న గాంధీజి పై గాడ్సె మూడు సార్లు కాల్పులు జరిపారు.దీంతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మహాత్మగాంధీకి చివరిసారి వీడ్కోలు పలికేందుకు దాదాపు 20 లక్షల మందికి పైగా వచ్చారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన వారు దాదాపు 8 కి.మీ. వరకు బారులు తీరారు. ఇప్పటివరకు ఏ భారతీయుడికి కూడా ఇంత జనం రాకపోవడం గమనార్హం.
  • 1959లో తమిళనాడులోని మధురైలో గాంధీ మెమొరియల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. గాంధీజిని గాడ్సె కాల్చడంతో ఆయన వస్త్రాలకు రక్తపు మరకలు అంటుకున్నాయి. ఆ వస్త్రం ఇప్పటికీ మ్యూజియంలోనే ఉండటం విశేషం.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

జాతీయ ప‌తాకాన్ని రూపొందించిన పింగ‌ళి వెంక‌య్య గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకు తెలుసా..?

మహాత్మా గాంధీకి ఉన్న ఈ హెల్త్ హ్యాబిట్స్ గురించి తెలుసా..? వీటిని మీరు కూడా తప్పకుండ అలవాటు చేసుకోవాలి..!

Visitors Are Also Reading