ఐపీఎస్ కు సెలెక్ట్ అయిన వారికి దాదాపు ఆరు నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత పోస్టింగ్ ఇస్తారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ట్రైనింగ్ లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ జుట్టును చిన్నగా కట్ చేయిస్తారు. సినిమాలలో చూసినట్టుగానే వాస్తవంగానే ట్రైనింగ్ సమయంలో పోలీస్ అధికారులకు జుట్టును చిన్నగా కత్తిరిస్తారు. ఇలా చిన్నగా ఎందుకు కత్తిరిస్తారు. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఐపీఎస్ ట్రైనింగ్ లో అభ్యర్థులు అందరూ ప్రతి రోజు ఉదయం ఐదు గంటలకే నిద్రలేవాలి. ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ట్రైనింగ్ నిరంతరాయంగా కొనసాగుతుంది. మధ్యలో కేవలం రెండు నుంచి మూడు గంటల వరకు గ్యాప్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో కఠినమైన టాస్కులను ఇస్తారు. నేలపై పాకాల్సి ఉంటుంది తాళ్లు పట్టుకొని ఎక్కడం, వేలాడడం ఉంటాయి. అలాంటి టాస్కులు చేసే సమయంలో గాయాల బారిన పడే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకే జుట్టును చిన్నగా కర్తరిస్తారు. యూనిఫాం వల్ల అందరూ ఒకటే అని.. వారి మధ్య కులమత వర్గ భేదాలు ఉండవు అని భావిస్తారో.. అదేవిధంగా హెయిర్ కటింగ్ చిన్నగా ఉంచుకోవడం వల్ల కూడా అందరూ ఒకటే అన్న భావం ఏర్పడుతుంది. అందరూ ఐక్యంగా ఉండేందుకు కూడా ఇది దోహదపడుతుంది.
Advertisement
సాధారణంగా కొంతమంది జుట్టును ఫ్యాషన్ డిజైన్ కనిపించేలా కట్ చేయించుకోవడానికి ఇష్టపడతారు. నాకు చాలా సమయమే తీసుకుంటుంది. అదే హెయిర్ కట్ చిన్నగా చేయించుకోవాలంటే అసలు సమయం ఎక్కువ తీసుకోదు. సమయాన్ని ఆదా చేయడం కోసం కూడా హెయిర్ కట్ ను చాలా చిన్నగా చేయించుకుంటారు. పోలీస్ ట్రైనింగ్ అన్న తర్వాత అక్కడ మనం మనకు నచ్చినట్టు ఉండవచ్చు అంటే కుదరదు. ట్రైనింగ్ లో కఠినమైన రూల్స్ పాటించాలి. ట్రైనింగ్ లో జాయిన్ కాగానే తొలుత జుట్టు చిన్నగా కట్ చేయిస్తారు. కేవలం ఐపీఎస్ ట్రైనింగ్ కి మాత్రమే కాదు.. ఆర్మీ, పోలీస్, నావీ ఇలా ఏ రంగంలో అయినా సరే ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు జుట్టును చిన్నగా కట్ చేయిస్తారు.
Also Read : మీ దాంపత్య జీవితంలో సమస్యలను తొలగించే 5 వాస్తు టిప్స్ ఇవే..!