జీవితంలో ఆనందం-సమృద్ధి, ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి కొన్ని రకాల లక్షణాలు మనలో ఉండాలని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. వాటిని అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి ఆయా ప్రయోజనాలను పొందుతాడని శాస్త్రీయ నిపుణులు, ఇప్పటికే పలు రంగాలలో విజయం సాధించినవారు పేర్కొంటున్నారు. మరి వ్యక్తి తన జీవితంలో పురోగతి కోసం అతనిలో ఏయే లక్షణాలు, విధానాలు ఉండాలని చాణక్యుడు అభిప్రాయపడ్డాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నైతిక ప్రవర్తన :
Advertisement
డబ్బుతో లేదా దానికి సంబంధించిన ఏదైనా పనిలో ఎల్లప్పుడూ నిజాయితీ, చిత్తశుద్ధి, నైతిక ప్రవర్తన పాటించాలి. అనైతిక మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు దీర్ఘకాలిక శ్రేయస్సు లేదా అనందాన్ని తీసుకురాదని చానక్యుడు చెప్పాడు. ఈ క్రమంలో వ్యక్తి తనలోని సమగ్రతను కాపాడుకోవడమే కాక తన నమ్మకాన్ని దృఢపరుచుకోవాలని సూచించాడు.
జ్ఞానం, నైపుణ్యాలు :
ఆచార్య చాణక్య జ్ఞానాన్ని పొందడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం కూడా మనిషిని పురోగతి వైపుకు నడిపిస్తాయని ఉద్ఘాటించాడు. విద్య, నైపుణ్యం ప్రాముఖ్యతను నొక్కి చెప్పే వ్యక్తి ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేడని చాణక్యుడు నమ్మాడు. కాబట్టి, మీరు నిరంతరం నేర్చుకోవడానికి, మీలోని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ విలువ, సంపాదన సామర్థ్యాన్ని పెంచుతుంది.
Advertisement
శ్రద్ధ,కృషి :
మీ లక్ష్యాలను సాధించడానికి పట్టుదలతో , కష్టపడి పని చేయాలని చాణక్యుడు పేర్కొన్నాడు. ఎందుకంటే కృషి, పట్టుదల, క్రమశిక్షణ వల్లే విజయం లభిస్తుందని చాణక్యుడు నమ్మాడు. మీ ప్రయత్నాలకు కట్టుబడి ఉండి, ప్రతి పనిని మీ సామర్థ్యం మేరకు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. విజయం మీ దరి చేరుతుంది.
నెట్ వర్కింగ్ , సంబంధాలు :
సమాజంలో తనదైన స్ట్రాంగ్ నెట్ వర్క్ ని నిర్మించుకోవడం, ఇతరులతో మంచి సంబంధాలను కొనసాగించడం ద్వారా కూడా వ్యక్తి తన జీవితంలో పురోగతిని సాధించవచ్చు అని చాణక్యుడు నొక్కి చెప్పాడు. అలానే బావసారూప్యత గల వ్యక్తులతో ఎక్కువగా గడపడంతో పాటు వారి నుంచి సలహాలను అందుకోవాలని, ఫలితంగా పరస్పర ప్రయోజనాకరమైన సంబంధాలు పెరుగుతాయని చాణక్యుడు తెలిపాడు.
సమయపాలన, అవకాశాలు :
సరైన సమయంలో అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకుంటేనే విజయం, పురోగతి సాధించడం సాధ్యమవుతుందట. అందుకే చాణక్యుడు తన నీతి శాస్త్రంలో సమయానికి ఉన్న ప్రాముఖ్యతను దాని ద్వారా వచ్చే అనుకూలమైన అవకాశాలను గుర్తించే సామర్థ్యం గురించి కూడా పేర్కొన్నాడు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
తన అభిమానిని తలుచుకొని బాధపడ్డ సూర్య.. ఎందుకంటే ?