Home » ఈ వారం థియేటర్ లో సందడి చేయబోయే చిత్రాలు ఇవే..!

ఈ వారం థియేటర్ లో సందడి చేయబోయే చిత్రాలు ఇవే..!

by Anji
Ad

గత వారం స్టార్ హీరోల సినిమాలతో పాటు పలు చిన్న సినిమాలు కూడా థియేటర్స్ వద్ద సందడి చేశాయి. రజినీకాంత్ లాల్ సలాం, రవితేజ ఈగల్ , సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన, ట్రూ లవర్, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాడ్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్స్ లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సుందరం మాస్టర్ : 

కమెడియన్ హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్‌’. కళ్యాణ్ సంతోష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దివ్య శ్రీపాద ఫీమేల్ లీడ్ రోల్ లో నటించింది. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు. తాజాగా మూవీని ప్రమోట్ చేస్తూ గ్రాండ్ గా ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు. రిలీజ్ దగ్గర పడడంతో నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.

మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా : 

Advertisement

తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో అభినవ్‌ గోమఠం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో తరుణ్‌ భాస్కర్‌, అలీ రెజా, వైశాలి కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 23న ఈ మూవీ థియేటర్స్ లో విడుదల కానుంది.

సిద్దార్థ్ రాయ్ : 

దాదాపు టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోలతో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్.. దీపక్ సరోజ్ హీరోగా తెరకెక్కిన మూవీ సిద్ధార్థ్‌ రాయ్‌. వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 23న థియేటర్స్ లో సందడి చేయనుంది.

ముఖ్య గమనిక : 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా తెరకెక్కిన సినిమా ‘ముఖ్య గమనిక’. డెబ్యూ డైరెక్టర్ వేణు మురళీధర్‌ దర్శకత్వం ఈ సినిమాకు  వహించారు. లావణ్య కథానాయికగా నటించారు. థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Visitors Are Also Reading