Home » IND Vs ENG : ఉప్పల్ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఇవే..!

IND Vs ENG : ఉప్పల్ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఇవే..!

by Anji
Ad

టీమిండియా హైదరాబాద్ లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే భారత్ ఓడిపోవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి.  ముఖ్యంగా ఓలి పోప్ ఇంగ్లండ్ బ్యాటర్   196 పరుగుల తో రాణించాడు. అయితే ఇతను  రెండుసార్లు క్యాచ్ లు  ఇచ్చినప్పటికీ  టీమిండియా ఫీల్డర్స్ జారవిడిచారు.

Advertisement

రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్,  జడేజా భారీ గా పరుగులు సమర్పించుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు. అటు టీమిండియా బ్యాటర్లలో జైస్వాల్, శ్రేయస్ అయ్యర్,  గిల్ ఘోర ప్రదర్శన కారణంగా టీమిండియా ఓటమిపాలైంది. అయితే రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ నిర్దేశించిన 231 టార్గెట్ ను ఛేదించలేకపోయింది. 28 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్ హార్ట్ లీ 7 వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ (39), భరత్, అశ్విన్ మినహా టీమిండియా బ్యాటర్లు ఎక్కువ స్కోర్ సాధించలేకపోయారు. చివరలో బుమ్రా, సిరాజ్ విజయం సాధిస్తారనుకునే లోపే హార్ట్ లీ బౌలింగ్ లో సిరాజ్ ముందుకు రావడంతో స్టంప్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ విజయం సాధించింది.

Advertisement

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading