Home » షర్మిల కొడుకు నిశ్చితార్థంలో ప్రధాన హైలైట్స్ ఇవే..!

షర్మిల కొడుకు నిశ్చితార్థంలో ప్రధాన హైలైట్స్ ఇవే..!

by Anji
Ad

హైదరాబాద్ లో జనవరి 18న రాత్రి వై.ఎస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుక అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకకు ఏపీ సీఎం వైఎస్ జగన్ చీఫ్ గెస్ట్ గా  హాజరయ్యారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మంత్రి కోమిటిరెడ్డి వెంకట్ రెడ్డి, సినీ నటుడు మోహన్ బాబు వంటి అతిథులు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Advertisement

ఈ ఎంగేజ్ మెంట్ వేడుకలో జగన్ కంటే కూడా అత్యంత ప్రాధాన్యత దక్కిన వ్యక్తి కేవీపీ రాంచందర్ రావు.. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఆత్మలా ఈయనను పిలుచుకునే వారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. బహుశా అందుకే కేవీపీనే తొలుత స్టేజీ పైకి వచ్చారేమో. ఆయన సమక్షంలోనే వేడుక ప్రారంభమైంది. షర్మిల, విజయమ్మలు కూడా కేవీపీకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తరువాతనే సీఎం జగన్ దంపతులు స్టేజీ పైకి వచ్చారు. హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో జరిగినటువంటి ఈ వేడుకలో ప్రముఖుల తాకిడి ఎక్కువ ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

తాజాగా ఈ వేడుక గురించి మరో వార్త వైరల్ అవుతోంది. ఈ నిశ్చితార్థ వేడుకలో 150 రకాల వంటకాలు వండినట్టు సమాచారం. ఆంధ్ర, తెలంగాణ రుచులను మిక్స్ చేసి అతిథులకు వడ్డించారట. మరీ నిశ్చితార్థమే ఇంత గ్రాండ్ గా చేస్తే.. ఇక పెళ్లి ఏర్పాట్లను ఇంకెలా చేస్తారో చూడాలి మరీ.

 

Visitors Are Also Reading