సాధారణంగా క్రికెట్ ఏ ఫార్మాట్ లోనైనా సెంచరీ చేయడం అనేది అంత తేలికైనా విషయమేమి కాదు. అన్ని ఫార్మాట్ లలో సెంచరీలు చేయాలంటే చాలా ప్రతిభ కావాలి. ఇప్పటివరకు ఏ ఫార్మాట్ లో సెంచరీలు సాధించినా బ్యాట్స్ మెన్స్ చాలా మంది ఉన్నారు. ఇక అందులో మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఏకంగా 100 సెంచరీలు సాధించి రికార్డునే సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. వన్డే క్రికెట్ లో చాలా సెంచరీలు సాధించలేకపోయినా కొంత మంది బ్యాట్స్ మెన్ లు ఉన్నారు. కొంత మంది అత్యంత లేట్ వయసులో సెంచరీ చేయడం విశేషం. కెరీర్ లో అత్యంత ఎక్కువ వయసులో తొలి వన్డే సెంచరీ చేసిన ఐదుగురు బ్యాట్స్ మెన్ లు ఉన్నారు వీరు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
భారత మాజీ వెటరన్ మోహిందర్ అమర్ నాథ్ తన వన్డే కెరీర్ లో 37 ఏళ్ల 117 రోజులకు మొదటి సెంచరీ చేశాడు. అతను తన మొదటి వన్డే సెంరీని జనవరి 19, 1988న ఫరీదాబాద్ లో వెస్టిండీస్ పై చేశాడు.తన వన్డే కెరీర్ లో కేవలం రెండ సెంచరీలు మాత్రమే చేశాడు.
సునీల్ గవాస్కర్ ఒకప్పుడు టెస్ట్ క్రికెట్ లో 34 సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. కానీ వన్డేలలో ఒకే ఒక్క సెంచరీ చేశాడని తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. అక్టోబర్ 31, 1987న నాగపూర్ లో న్యూజిలాండ్ పై ఏకైక సెంచరీని సాధించాడు. మొదటి వన్డే సెంచరీ 38 సంవత్సరాల 113 రోజుల వయస్సులో చేశాడు.
Advertisement
బెర్ముడా మాజీ ఓపెనర్ డేవిడ్ హెంప్ కెన్యాపై ఏప్రిల్ 6, 2009న తొలి వన్డే సెంచరీని సాధించాడు. 38 ఏళ్ల 149 రోజుల తరువాత తన వన్డే క్రికెట్ కెరీర్ లో తొలి సెంచరీని సాధించాడు. ఈ సెంచరీ అతని కెరీర్ లో ఒకే ఒక సెంచరీ కావడం గమనార్హం.
Also Read : భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ లలో అత్యధిక వికెట్లు తీసింది వీరే.. !
ఇంగ్లాండ్ మాజీ వెటరన్ జియోఫ్ బాయ్ కాట్ తన వన్డే కెరీర్ లో 39 సంవత్సరాల 51 రోజుల వయస్సులో ఫస్ట్ సెంచరీ చేశాడు. తన కెరీర్ లో తొలి సెంచరీని డిసెంబర్ 11, 1979న సిడ్నీలో ఆస్ట్రేలియాపై సాధించాడు.
యూఏఈ ఆటగాడు ఖుర్రంఖాన్ అత్యంత ఎక్కువ వయసులో వన్డేలలో మొదటి సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డును సృష్టించాడు. 43 ఏళ్ల 162 రోజుల వయసులో కెరీర్ లో తొలి వన్డే సెంచరీ సాధించాడు. 2014లో ఆప్గనిస్తాన్ పై సెంచరీ సాధించాడు.
Also Read : ఫిపా ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి.. ఫ్రాపార్ట్ రిఫరీగా వ్యవహరించిన మహిళా..!