సాధారణంగా వేసవికాలం వచ్చిందంటే చాలు రోడ్డుకి చుట్టు పక్కల పుచ్చకాయలు, గుమ్మడికాయలు, దోసకాయలు వంటివి విక్రయిస్తుంటారు. ఎండ తాకిడి ఎక్కువగా ఉండే వేసవికాలంలో కాసేపు బయటికి వెళ్తే శరీరం డీ హైడ్రేషన్ కి గురవుతుంది. చర్మం పొడిబారడం, తలనొప్పి, వాంతులు వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. కాబట్టి కొబ్బరిబోండ, గుమ్మడికాయ, దోసకాయ, పుచ్చకాయ వంటి వేసవి ఆహారాలు సహజమైనవి శరీరానికి హాని కలిగించవు. ముఖ్యంగా అల్సర్ పొట్ట సమస్యలు ఉంటే వైద్యులు ఈ నీటిని తాగాలని సూచిస్తుంటారు. సమ్మర్ ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
పుచ్చకాయ :
ఈ పండులో శరీరానికి అవసరమైన విటమిన్ సి, లైకోపీన్ విటమిన్ ఏ, పొటాషియం, అమినో యాసిడ్, సోడియం, క్యాలరీలుంటాయి. సహజ ఎసిటిక్ యాసిడ్ కలిగి ఉండడంతో కేవలం కడుపు నింపడమే కాకుండా ఇందులో లైకోపీన్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇక ఇందులో ఉండే విటమిన్ సి కరోనా నుంచి మనలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పెరుగు :
పెరుగు చాలా ప్రత్యేకమైందనే చెప్పాలి. పెరుగు తయారు చేసే పద్దతికి ఉత్పత్తి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. లాక్టోబాసిల్లస్ అనే మంచి బ్యాక్టీరియా శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఎంతగానో సహాయపడుతాయి. మెదడు అభివృద్దికి తోడ్పడుతుంది. ఆహారం జీర్ణమవ్వడానికి సహాయపడుతుంది. ఆందోళన, ఒత్తిడి వల్ల శరీరంలో దీర్ఘకాలిక మంటను సరి చేస్తుంది.
Advertisement
మజ్జిగ :
పాల విరుగుడు మీ శరీరాన్ని చల్ల బరుచుతుంది. జీవక్రియను మెరుగు పరచడంలో కూడా సహాయపడుతుంది. మినరల్స్, విటమిన్లను కలిగి ఉంటుంది. మన శరీరం సూర్యుడిచే ప్రభావితమైనప్పుడు మీ శరీర శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కొబ్బరి బోండా :
ఇది తాగడం వల్ల శరీరంలోకి శక్తిని పెరుగుతుంది. మీ శరీరం జీర్ణ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. రక్తపోటును సమతుల్యం చేయడానికి కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
Also Read : నోటి దుర్వాసనను నివారించడానికి ఈ చిట్కాలను తప్పక పాటించండి..!
కీరదోసకాయ :
కీరదోసకాయ నీరు ఎక్కువగా ఉంటుంది. మన శరీరాన్ని చల్లబరుస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జుట్టు బాగా పెరిగేవిధంగా చేస్తుంది. దీనిని సలాడ్ లేదా జ్యూస్ తాగడం మంచిది.
బూడిద గుమ్మడికాయ :
గుమ్మడికాయను ఉదయాన్నే తీసుకుంటే శరీరానికి చాలా మంచిది. హానికరమైన పదార్థాలను బయటికి పంపించడానికి శరీరానికి సహాయపడుతుంది. నిమ్మరసం కలిపి జ్యూస్ తీసుకుంటే చాలా మంచిది.
Also Read : తెల్ల శనగలతో మీ పొట్ట కొవ్వు కరిగించవచ్చనే విషయం మీకు తెలుసా ?