Home » నందమూరి చైతన్య కృష్ణ ఎవరు..? గతంలో సినిమాల్లో నటించాడనే విషయం మీకు తెలుసా ?

నందమూరి చైతన్య కృష్ణ ఎవరు..? గతంలో సినిమాల్లో నటించాడనే విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

నందమూరి చైతన్య కృష్ణ గురించి చాలా మందికి తెలియదు.  ఇతను దివంగత నటుడు నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి వచ్చిన మరో నట వారసుడు.  ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కొడుకే ఈ చైతన్య కృష్ణ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈయన హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. దానికి ప్రధాన కారణం లేట్ వయసులో లేటెస్ట్ గా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడమే. నెటిజన్స్  సీనియర్ ఎన్టీఆర్  మనవడు చైతన్య గురించి ఆరా తీస్తున్నారు. మనం కూడా చైతన్య గురించి తెలుసుకుందాం.

Advertisement

నందమూరి చైతన్య కృష్ణ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రీత్. మెడికల్ మాఫియా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఈ మూవీతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు నందమూరి వారసుడు. నందమూరి తారక రామారావు కొడుకు జయకృష్ణ కుమారుడే ఈ చైతన్య కృష్ణ. సినిమాలపై ఉన్న ప్రేమతో లేట్ వయసులో లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే 2003లో జగపతి బాబు హీరోగా వచ్చిన ధమ్ లో ఓ పాత్రలో మెరిశాడు ఈ నందమూరి అబ్బాయి. ఇక ఆ తర్వాత అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఇన్నేళ్ల తరువాత  నటనపై అతడికి ప్రేమ తగ్గలేదని బ్రీత్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి నిరూపించుకున్నాడు.

Advertisement

సాధారణంగా ఇండస్ట్రీకి రావడానికి ఏజ్ అంటూ ఉండదు. అయితే హీరోగా, హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలంటే మాత్రం వయసు చూసుకోవాల్సిందే. కానీ ఇవన్నీ పట్టించుకోలేదు చైతన్య. ఈ క్రమంలోనే తన డ్రీమ్ కోసం ఎవరెన్ని విమర్శలు చేసినా అవేమీ  పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ  ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. 2020 డిసెంబర్ 18న చైతన్య కృష్ణ వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. మరోవైపు  మధ్యలో పాలిటిక్స్ లో కూడా కనిపించాడు.  బ్రీత్ సినిమా అనౌన్స్ చేసిన అప్పటి నుంచి చైతన్య పై ఒక రకమైన కామెంట్స్  ప్రారంభం అయ్యాయి. దానికి కారణం ఆయన కాస్త లేట్ గా ఇండస్ట్రీకి రావడమే. ఆ విమర్శలను సైతం చైతన్య పక్కకు పెట్టి  హీరోగా తొలి అడుగు వేశాడు.  ఇండస్ట్రీలో అలాగే కంటిన్యూ అవుతాడో లేదో వేచి చూడాలి మరీ.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading