Home » లాస్య నందిత గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు ఇవే..!

లాస్య నందిత గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు ఇవే..!

by Anji
Ad

లాస్య నందిత అనే పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎవ్వరికీ తెలియదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు తప్పా..  2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కూతురు వెన్నెల పై లాస్య నందిత విజయం సాధించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లాస్య నందిత పేరు మారు మ్రోగింది. గద్దర్ కూతురుని ఓడించిందని చర్చించుకున్నారు.

Lasya-Nandita-Photos

Advertisement

 

ప్రజా యుద్ధనౌక గద్దర్ కూతురు మూడో స్థానానికి పరిమితం అయ్యారు. బీజేపీ అభ్యర్థి గణేష్ పై 17,169 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. రాజకీయాలు ఆమెకు కొత్త ఏమి కాదు.. అంతకు ముందు తండ్రి సాయన్న 5 సార్లు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ.. ఆయనకు మద్దతుగా నిలిచేది. గత పదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉంది లాస్య. తాజాగా పటాన్ చెరు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. ముఖ్యంగా రెండు నెలల వ్యవధిలో ఆమె మూడు సార్లు వరుస ప్రమాదాలకు గురయ్యారు. మృత్యువు వేటాడుతుందన్నట్టుగా వరుసగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆమె మరణంతో తెలంగాణలో విషాద చాయలు అలుముకున్నాయి. తండ్రి కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చిన లాస్య నందిత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది. ఈమె పెళ్లి చేసుకోకుండా ఎందుకు మిగిలిపోయింది. ఆమె ప్రమాదానికి గురవ్వడానికి కారణం ఏంటి..?  అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

లాస్య నందిత సెప్టెంబర్ 17న 1987లో జి.సాయన్న, గీత దంపతులకు జన్మించారు. ఈమెకు ఇద్దరూ సోదరీ మణులున్నారు. 2004లో హైదరాబాద్ లోని రత్న కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఈమె చిన్న వయస్సులోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సాయన్న తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయాన్ని ప్రస్థానం ప్రారంభించారు. 1999 నుంచి 2014 వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా కొనసాగారు. 21 సంవత్సరాల పాటు తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 2015లో బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ఐదు సార్లు కంటోన్మెంట్ నుంచి విజయం సాధించారు సాయన్న. ఫిబ్రవరి 19, 2023న యశోద ఆసుపత్రిలో మరణించారు. చాలా కాలం నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. షుగర్ వ్యాధి కారణంగా కాలు కూడా తొలగించారు.

Advertisement

 

సాయన్నకు ఆరోగ్యం సహకరించని కారణంగా పార్టీ బాధ్యతలను తన భుజాన వేసుకొని సేవలు అందించారు లాస్య. 28 ఏళ్ల వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చింది. 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ సభ్యురాలుగా పోటీ చేసి ఓడిపోయారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ కార్పొరేటర్ గా విజయం సాధించారు. 2021లో కవాడిగూడ కార్పొరేటర్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తండ్రి సాయన్నకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు లాస్య నందిత.  తాను లాస్య ఫౌండేషన్ ఏర్పాటు చేసిన అనేక సేవ కార్యక్రమాలు చేశారు. తన సంస్థ ద్వారా నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చి ఉపాధి కల్పించడం.. వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు, వృద్ధులకు వైద్య సేవలందించడం.. ఉచితంగా మందులు అందించడం.. అనాథలకు ఆహారం, దుప్పట్లు పంపిణీ చేయడం వంటి సేవా కార్యక్రమాలు చేశారు. కవాడిగూడ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడిందని.. 180 వద్ద డబుల్ బెడ్ రూంల విషయంలో రూ.5లక్షల చొప్పున తీసుకుందని వార్తలు వినిపించాయి.

 

ఈ అవినీతి ఆరోపణల తరువాత సాయన్న మరణం తరువాత లాస్యకి బీఆర్ఎస్ టికెట్ దక్కదని అంతా భావించారు. కానీ కేసీఆర్ ఆమెకు టికెట్ కేటాయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నియోజకవర్గంలోని ప్రజలకు సేవలందించారు. రెండు నెలలనుంచి మృత్యువు  వెంటాడుతుంది.  లాస్య నందిత ఓవర్ లోడు కారణంగా లిప్ట్ లో ఇరుక్కుపోయారు. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తమై లిప్ట్ డోర్లు బద్దలు కొట్టారు. దీంతో సురక్షితంగా బయటికి లాస్య నందిత. ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత మొదటి ప్రమాదం. ఫిబ్రవరి 13న బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభకు వెళ్లి తిరిగి వస్తుండగా.. నార్కెట్ పల్లి వద్దకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. రహదారి పక్కన రేలింగ్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హోంగార్డు ప్రాణాలు కోల్పోయారు. లాస్య నందిత, పీఏ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మూడో సారి జరిగిన ప్రమాదంలో ఆమె మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయింది.

Also Read : దేశంలో తొలి బుల్లెట్‌ రైలు ఎప్పుడు, ఏ మార్గంలో నడుస్తుందో మీకు తెలుసా ?

Visitors Are Also Reading