Home » ఎముకలను దృఢంగా మార్చే ఇంటి చిట్కాలు ఇవే..!

ఎముకలను దృఢంగా మార్చే ఇంటి చిట్కాలు ఇవే..!

by Anji
Ad

మన శరీరంలో ఎముకలు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. మన శరీరంలోని ప్రతి ఎముక దాని స్వంత పనితీరును కలిగి ఉంటుంది. మొత్తం శరీరం ఎముకల నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. ఏ రకమైన వ్యాధి లేదా ఎముకలకు నష్టం వాటిల్లినా మన మొత్తం శరీరం ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎముకలను దృఢంగా ఉంచుకోవడానికి కొన్ని హోం రెమెడీస్‌ను తెలుసుకుందాం.

Advertisement

Advertisement

ఎముకల ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోతే అది ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధికి దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. ఎముకలు బలహీనపడటం మొదలైతే తరచుగా పగుళ్లు, బలహీనమైన గోర్లు, వెన్నునొప్పి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి కాల్షియం ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలని అంటున్నారు. నడిచేటప్పుడు ఎముకలు నొప్పిగా అనిపించడం. ఎముక పగుళ్లు ఏర్పడితే మానేందుకు చాలా సమయం పట్టడం. రాత్రిపూట ఎముకలలో ఎక్కువ నొప్పి అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. ఆలస్యం చేస్తే నడక కష్టంగా మారవచ్చు.

 

ప్రొటీన్, ఐరన్‌లా కాల్షియం కూడా శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో ఒకటి. ఎముకలు, దంతాల అభివృద్ధికి, మంచి ఆరోగ్యానికి కాల్షియం అవసరం. కాల్షియం లోపం ఎముకలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. అందుకే మీ ఆహారంలో పాలు, పెరుగు, చీజ్, నువ్వులు, బాదం, బ్రోకలీ, బీన్స్, నారింజ, గుడ్లు, కిడ్నీ బీన్స్‌ ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read : పరగడుపున ఈ నీరు తాగితే సంజీవనితో సమానం..!

Visitors Are Also Reading