Home » రాత్రి ఎనిమిది త‌రువాత ఈ ఆహారాలు అస్స‌లు తిన‌కూడ‌దు.. తింటే ఆ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు..!

రాత్రి ఎనిమిది త‌రువాత ఈ ఆహారాలు అస్స‌లు తిన‌కూడ‌దు.. తింటే ఆ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు..!

by Anji
Ad

రాత్రి స‌మ‌యంలో ఎంత ఎర్లీగా తింటే అంత మంచిదట‌. ముఖ్యంగా ఎనిమిది గంట‌ల‌లోపే తిన‌మ‌ని చెబుతుంటారు వైద్య నిపుణులు. చాలా మంది రాత్రి 9గంట‌లు దాటిన త‌రువాత తింటుంటారు. రాత్రి ఆల‌స్యంగా భోజ‌నం చేయ‌డం ద్వారా చాలా మంది బ‌రువు పెరుగుతున్న‌ట్టు అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. ఎంత మంది రాత్రి ఎనిమిది లోపు భోజనం పూర్తి చేస్తున్నార‌ని స‌ర్వే చేస్తే అతి త‌క్కువ శాతం మంది అనే చెప్ప‌వ‌చ్చు. పోష‌కాహార నిపుణుల ప్ర‌కారం.. మ‌నం నిద్ర పోవ‌డానికి రెండు లేదా మూడు గంట‌ల ముందే డిన్న‌ర్ పూర్తి చేయాల‌ట‌.


ఇక ఒక‌వేళ నిద్ర‌పోవ‌డానికి ఒక గంట ముందే అయితే తేలిపాటి భోజ‌నం చేయాల‌ని సూచిస్తున్నారు. భారీ భోజ‌నం తిని వెంట‌నే నిద్ర‌పోతే సులువుగా బ‌రువు పెరుగుతారు. వాస్త‌వానికి తేలిక‌పాటి ఆహారం తిని ప‌డుకుంటే నిద్ర‌లోనే మ‌నం బ‌రువు త‌గ్గుతుంటాం. తేలిక‌పాటి ఆహారం తీసుకోకుంటే మాత్రం పెరుగుతామ‌నే విష‌యం గుర్తుంచుకోవాలి. రాత్రి స‌మ‌యంలో లేటుగా ఆహారం తినాల్సి వ‌స్తే మాత్రం కేల‌రీలు త‌క్కువ‌గా ఉండేవి తీసుకోవాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్‌, ఫాస్ట్ పుడ్ తిన‌కూడ‌దు. అదేవిధంగా తిన్న త‌రువాత కొద్దిసేపు త‌ప్ప‌కుండా వాకింగ్ చేయాలి.

Advertisement

 

రాత్రి ఎనిమిది త‌రువాత తిన‌కూడ‌ని ఆహారాలు :

చాక్లెట్

తీపి కోరిక‌ల‌ను అధిగ‌మించ‌క త‌ప్ప‌దు. రాత్రి ఎనిమిది దాటిన త‌రువాత చాక్లెట్ అస్స‌లు తిన‌కూడ‌దు. ఇవి అధికంగా కేల‌రీల‌ను జోడిస్తాయి. మెగ్నిషియం, యాంటి ఆక్సిడెంట్లు పుష్క‌లంగా నిండి ఉంటాయి. ఇది మిమ్మ‌ల్ని మేల్కొనే విధంగా చేస్తుంది.

ఆల్క‌హాల్

Advertisement

బ‌రువు పెర‌గ‌డానికి, నిద్ర‌కు భంగం క‌లిగించ‌డానికి ఆల్క‌హాల్ ఎప్పుడూ ముందే ఉంటుంది. రాత్రి స‌మ‌యంలో అస్స‌లు మ‌ద్యం సేవించ‌కూడ‌దు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఆల్క‌హాల్ కు దూరంగా ఉండాలి.

చిప్స్

చిప్స్‌ను డీప్ ఫ్రై చేస్తుంటారు. అవి కేల‌రీల‌తో నిండి ఉంటాయి. చాలా మంది టీవీ చూస్తు చిప్స్‌ను లాగించేస్తారు. ఆహారం తిన్న త‌రువాత కొంత మంది రాత్రి టీవీ చూస్తూ చిప్స్ తింటారు. ఆ అల‌వాటును వ‌దిలేయండి.

కూల్ డ్రింక్

బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ లేట్ నైట్ తీసుకుంటున్నారా..? అయితే మీరు త‌ప్ప‌కుండా బ‌రువు పెరిగిపోతారు. అదేవిధంగా అనారోగ్యాలు త‌ప్ప‌వు. వీటిలో చ‌క్కెర‌, కేల‌రీలు అధికంగా ఉంటాయి. కూల్ డ్రింక్ తాగ‌డం ద్వారా చాలా స‌మ‌స్య‌లొస్తాయి.

ఐస్ క్రీములు

అర్థ‌రాత్రి ఐస్ క్రీమ్‌లు తిన్న వారు రొమాంటిక్ ఫెలో అని చెప్పుకునే వారు. కానీ అలా చెప్పుకునే వారు రాబోయే రోజుల్లో జ‌బ్బుల‌ను కూడా తెలుసుకుని తింటే బెట‌ర్‌. ఐస్‌క్రీమ్ రాత్రి పూట తింటే అధిక బ‌రువు పెరుగుతారు. తిన‌డం మానేయ‌డం మంచిది. పైన చెప్పిన ఆహారం త‌ర‌చూ రాత్రి వేళ‌లో తిన‌డం ద్వారా ఊబ‌కాయంతో డిప్రెష‌న్‌, మాన‌సిక స‌మ‌స్య‌లు, నిద్ర‌లేమి వంటి స‌మ‌స్య‌లు సంభ‌వించే అవ‌కాశం ఎక్కువ‌. ఎందుకు ఇలాంటి స‌మ‌స్య‌లు తెచ్చుకునే కంటే రాత్రి స‌మ‌యంలో ఎర్లీగా తిన‌డం బెట‌ర్ అని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : 

ఊర‌గాయ ప‌చ్చ‌ళ్ల‌ను ఎక్కువ‌గా తిన‌కూడ‌దా..? తింటే ఏమవుతుందంటే..?

మ‌ర‌ణించిన మ‌నిషిని తిరిగి బ్ర‌తికించ‌గ‌ల‌మా… సైన్స్ ఏం చెబుతుందంటే..?

Visitors Are Also Reading