Telugu News » ఇండస్ట్రీలో భాయ్ ఏజ్ గ్యాప్ తో పెళ్లి చేసుకున్న జంటలు వీరే !

ఇండస్ట్రీలో భాయ్ ఏజ్ గ్యాప్ తో పెళ్లి చేసుకున్న జంటలు వీరే !

by Bunty

ఇప్పుడు దేశవ్యాప్తంగా కత్రినా, విక్కీ పెళ్లి విషయంపై చర్చ నడుస్తోంది. 38 ఏళ్ల కత్రినా 33 ఏళ్ల విక్కీ కౌశల్‌ని పెళ్లి చేసుకోవడం, ఈ జంట సరిపోలలేదని కొంతమంది వాదిస్తున్నారు. ఇక మలైకా అరోరా తన కన్నా 10 ఏళ్ళు చిన్న అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేసినప్పుడు కూడా సోషల్ మీడియాలో రచ్చ జరిగిన విషయం తెలిసిందే.

Ads

Katrina Kaif, Vicky Kaushal or Malaika Arora, Arjun Kapoor; Which duo you'd  like to see on Koffee With Karan? | PINKVILLA

ఈ నేపథ్యంలో రెండు అంకెల సంఖ్య తేడాతో పెళ్లి చేసుకున్న సెలెబ్రిటీల లిస్ట్ ను పరిశీలిద్దాం. షాహిద్ కపూర్ తన కంటే 13 ఏళ్ల చిన్నది అయిన మీరాను వివాహం చేసుకున్నప్పుడు వయస్సు అంతరం కారణంగా ఎవరూ ఈ జంట గురించి మాట్లాడలేదు. సంజయ్ దత్ తన కంటే 19 ఏళ్లు చిన్నవాడైన మాన్యతా దత్‌ని పెళ్లి చేసుకున్నాడు. అమీర్ ఖాన్ తన కంటే 9 ఏళ్లు చిన్నదైన కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు. బోనీ కపూర్ తన కంటే 9 ఏళ్లు చిన్నదైన శ్రీదేవిని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వయస్సు ప్రశ్నే రాలేదు. ఇంకా కొంచెం వెనక్కి వెళితే దిలీప్ కుమార్ 23 ఏళ్ల చిన్న షైరా బానోను వివాహం చేసుకున్నాడు. హేమమాలిని ధర్మేంద్ర కంటే 13 ఏళ్లు చిన్నది. డింపుల్ కపాడియా, రాజేష్ ఖన్నా వయసులో 16 ఏళ్ల తేడా ఉంది. కబీర్ బేడీ తన కంటే 29 ఏళ్ల చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కమల్ అమ్రోహి కంటే మీనా కుమారి 15 ఏళ్లు చిన్నది. ఆధునిక జంట రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా మధ్య 9 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉంది.


You may also like