ప్రతి రోజు చాలా మందికి భోజనంలో పెరుగు అలవాటు ఉంటుంది. కొంత మంది అయితే కేవలం పెరుగుతోనే తింటారు. ఎక్కువగా మాత్రం భోజనం ముగిసే ముందు చివరలో పెరుగుతో తింటారు. పెరుగు తినడం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ప్రయోజనాలే ఉన్నాయి. పెరుగులో ఉన్నటువంటి ఔషద గుణాలు ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతాయనే చెప్పవచ్చు.
ముఖ్యంగా పెరుగలో ఉండే కాల్షియం పాస్పరస్ ప్రోటీన్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పెరుగు తినడం వల్ల అధిక బరువు తగ్గించుకునే అవకాశముంటుంది. రెగ్యులర్ గా పెరుగును ఆహారంలోకి తీసుకోవడం వల్ల కొవ్వు కరిగిపోయి బరువు తగ్గుతారు. పాలలో ఉండే కాల్షియం పెరుగులో కూడా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ప్రోటీన్లను శరీరానికి అందిస్తుంది. కాబట్టి పెరుగు అన్నం మంచి ఔషదంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా డయాబెటిస్, మలబద్ధక సమస్యలకు పెరుగుతో చెక్ పెట్టవచ్చు. ప్రతి రోజు పెరుగు తింటూ ఉండడం వల్ల ఆ దీర్ఘకాలిక సమస్యలు అన్నీ కూడా మాయమవుతాయి. బాడీలో షుగర్ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేసే ఔషద గుణాలు పెరుగులో ఉంటాయి.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : లవంగాల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు తినకుండా ఉండరు..!
పెరుగులో ఉండే పొటాషియం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. పెరుగు అన్నం రాత్రి పూట తినే వారికి సుఖమైన నిద్ర వస్తుంది. ఇప్పటి వరకు కూడా పెరుగు అంటే ఇష్టంలేదనే వారు ఇకపై అయినా ఇష్టంగా మార్చుకొని పెరుగు అన్నంను ఔషదంగా మార్చుకుని పెరుగు అన్నంని ఔషదంగా తీసుకోండి. రాత్రి సమయంలో నిద్రలోకి తొందరగా జారుకోవాలంటే మాత్రం చల్లని పెరుగు తింటే ప్రయోజనం ఉంటుంది. పెరుగును కొందరూ మజ్జిగగా లేదంటే పలుచని చల్లగా తాగుతుంటారు. రూపం ఏదైనా అది అందించే ప్రతిఫలం అద్భుతమనే చెప్పాలి.
ఇది కూడా చదవండి : బెల్లం, పుట్నాల పప్పు కలిపి తింటున్నారా..? అయితే విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!