Home » ఈ ఆకులు అమృతంతో సమానం.. వీటిని ఎలా వాడాలంటే..?

ఈ ఆకులు అమృతంతో సమానం.. వీటిని ఎలా వాడాలంటే..?

by Anji
Ad

ఆధునిక జీవన శైలి కారణంగా చిన్న వయసులోనే మధుమేహం వంటి వ్యాధులకు గురవుతున్నారు. అంతేకాకుండా కొందరిలో రక్తంలో చక్కెర స్థాయి పెరిగి.. కళ్ళు, గుండె, మూత్రపిండాలు, కళ్ళు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే దీని నుంచి విముక్తి పొందడానికి ‘సేజ్’ అనే ఆకులను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే సేజ్ ఆకులను శతాబ్దాలుగా మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఇంకా చాలా రకాలుగా వీటిని ఉపయోగించుకోవచ్చు. వీటి ధర ఎక్కువే. 100 గ్రాముల ఎండిపోయిన సేజ్ ఆకుల ధర దాదాపు రూ.200 ఉంది. మన శరీరంలో వేడి, నొప్పులను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సేజ్ ఆకుల్లో ఉన్నాయి.

Advertisement

అంతేకాదు వీటిలో యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల మనం ఈ ఆకుల్ని వాడితే.. మనకు క్యాన్సర్, ఇతర రోగాలు వచ్చే అవకాశాలు తక్కువ. కణాలను ఇవి బాగా కాపాడతాయి. పిల్లలకు మనం సరస్వతి ఆకులు తినిపిస్తాం కదా.. వాటిని తింటే వారికి చదువు బాగా వస్తుందని భావిస్తాం కదా… అలాగే ఈ ఆకులు కూడా మెమరీ పవర్ పెంచుతాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ ఎవరైనా సరే.. బ్రెయిన్ బాగా పనిచెయ్యాలంటే.. ఈ ఆకులు వాడాలి. మతిమరపు లాంటి అల్జీమర్స్ వ్యాధి రాకుండా ఈ ఆకులు కాపాడగలవు. మహిళల్లో మెనోపాజ్ దశ వారికి పెద్ద సమస్య. ఈ దశలో వారికి అన్ని రకాలుగా మేలు చేసే గుణాలు సేజ్ ఆకుల్లో ఉన్నాయి.

Advertisement

 

అందువల్ల మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు ఈ ఆకులను వాడటం చాలా మేలు. అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలకు సేజ్ ఆకులు కొంతవరకూ ఉపశమనం కలిగించగలవు. నిండా ఔషధ గుణాలతో ఉండటం వల్ల ఈ ఆకులు.. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడగలవు. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు ఈ ఆకులను తీసుకుంటే.. వారి బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. సేజ్ ఆకుల్ని వంటల్లో ఉపయోగిస్తారు.

 

ముఖ్యంగా మధ్య ఆసియా, గల్ఫ్ దేశాల్లో వాడుతారు. ఎందుకంటే ఇది సువాసన వస్తుంది. సాస్‌లు, స్టఫ్‌లు, సూప్‌లు, స్ట్యూస్‌లలో వాడుతారు. సేజ్ ఆకులతో హెర్బల్ టీ తయారుచేస్తారు. ఇది గొంతులో మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వేడి నీటిలో కొన్ని సేజ్ ఆకులు వేసి.. కొన్ని నిమిషాలు ఉడికించి.. వడగట్టి, టీలా తాగుతారు. ఈ సేజ్ ఆకులతో వచ్చే సువాసన.. ఒత్తిడి, ఆందోళనను తగ్గించగలదు. ఎండిన ఆకులను బొగ్గులపై వేసి కాల్చితే.. వచ్చే పొగకు ఇల్లంతా పరిమళాలతో నిండిపోతుంది. ఈ ఆకుల్ని గర్భిణీలు, బాలింతలు ఎక్కువగా వాడకూడదు. అందుకే వీటిని కొద్దిగానే వాడుకుంటే ఆరోగ్యం. మీకు ఈ ఎండిన ఆకులు కావాలి అనుకున్నా, లేక ఈ ఆకుల టీ పొడి కావాలి అనుకున్నా… ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో లభిస్తున్నాయి.  ఇంకెందుకు ఆలస్యం కావాలనుకున్న వారు ఆర్డర్ చేసుకోండి.

Also Read :  కంది పప్పు ఎక్కువగా తింటున్నారా..? ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Visitors Are Also Reading