దాదాపు 2వేల సంవత్సరాల కిందటే టోపు చైనాలో ఉపయోగించబడుతోంది. ముఖ్యంగా శరీరానికి ప్రోటీన్ మూలం. ఇక టోపు అనేది సోయాబీన్ పాల పెరుగు రూపానికి ఇవ్వబడిన పేరు. ఇది సాప్ట్‌టోపు, సిల్కెన్ టోపు, దృఢమైన టోపు, పులియబెట్టి టోపు అని రకరకాల్లో లభిస్తుంది. సోయా పాలతో తయారైన టోపులో కాల్షియం, మెగ్నిషియం, కాపర్, విటమిన్ ఏ, మాంగనీస్, ప్రోటిన్, విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. టోపు కాల్షియం, ఐరన్ అద్భుతమైన మూలం. కొలెస్ట్రాల్ లేనిది, బరువు తగ్గడానికి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. టోపు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
టోపులో కొలెస్ట్రాల్ ఉండదు. ఇది బరువు తగ్గడానికి ఫిట్‌నెస్ ఔత్సాహికులకు ఇది గొప్ప ఆహారం. అదేవిధంగా టోపులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. తక్కువ కొవ్వును కలిగి ఉంటాయి. ఇది చాలా కాలం పాటు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది. టోపులో కనిపించే ఫైటోన్యూట్రియెంట్ అయిన ఐసోప్లేవొన్స్, మహిళల శరీరంలో ఉండే హార్మోన్ ఈస్ట్రోజెన్ కలిగి ఉంటుంది. మహిళలు మోనోపాజ్‌లో ఉన్నప్పుడు వారి ఆహారంలో టోపును జోడించడం వల్ల ఈస్ట్రోజన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది వేడి ఆవిర్లు, చెమట, అధిక హృదయ స్పందన వంటి లక్షణాలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రొమ్ము క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్‌ల నుంచి రక్షిస్తుంది.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : నువ్వులు, ఉసిరి మీ ఇంట్లో ఉంటే తెల్లజుట్టు నల్లగా మారాల్సిందే..!
టోపు తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్స్, ఎల్‌డీఎల్, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ అయినటువంటి హెచ్‌డీఎల్ పెరుగుతుంది. కాల్షియం అద్భుతమైన మూలం. టోపు శరీరంలో ఎముకలను నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బోలు ఎముకల వ్యాధిని సరి చేయడానికి, శరీరంలో కాల్షియం లేకపోవడం వల్ల ఎముకలు బలహీనపడడం వంటి వాటికి ప్రతీరోజూ ఆహారంతో టోపు తీసుకోవడం చాలా మంచిది. టోపులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహ వ్యాధి గ్రస్తులు దీనిని విరివిగా తినవచ్చు. ఇందులో ప్రోటిన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. టోపు తినే మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి మూత్రంలో ప్రోటీన్ మొత్తాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు పేర్కొన్నాయి. కేవలం టోపు మాత్రమే కాదు.. సోయా ఆధారిత ఉత్పత్తులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఇది కూడా చదవండి : పవన్ కళ్యాణ్‌కి పవర్ స్టార్ బిరుదు రావడానికి కారణం ఎవరో తెలుసా..?