సాధారణంగా పెళ్లీడు వచ్చిందంటే చాలు చాలా మంది పెళ్లి గురించే ఆలోచిస్తారు. అయితే పూర్వకాలంలో ఈ తంతు ఎక్కువగా నడిచేది. ప్రతి ఒక్కరి ఆలోచన మారింది. జీవితంలో ఒక పొజిషన్ కు వచ్చాకే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ జనరేషన్లో 30 ఏళ్లు దాటినా కానీ పెళ్లి ఊసెత్తడం లేదు. ఉద్యోగం వచ్చి లైఫ్ లో సెట్ అయ్యాకే పెళ్లి అనే మాటకు వస్తున్నారు. అయితే సాధారణంగా పెళ్లి అనేది ఎందుకు చేసుకోవాలి.. ఆ వివరాలు ఏంటో చూద్దామా..
also read:శర్వానంద్ ఎంగేజ్మెంట్ అయి ఇన్ని నెలలైనా పెళ్లి ఎందుకు కావట్లేదో తెలుసా..?
Advertisement
ప్రతి ఒక్క మనిషి మూడు గుణాలతో పుడతారట.. ఇందులో ఒకటి రుషి రుణం, రెండవది దేవరుణం, మూడవది పితృ రుణం. ఈ మూడు రుణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి. ఈ రుణాలు తీర్చకపోతే మరల జన్మ ఎత్తవలసి వస్తుందట. మానవ జన్మకు సార్ధకత జన్మరాహిత్యం. కావున ప్రతివాడు రుణ విముక్తుడు కావాలి అంటే యజ్ఞం చేయడం, వేదాధ్యయనం,సంతానం కనడం ఇవి మానవుడు తప్పనిసరిగా చేయవలసిన విధులు అని వేదం చెబుతోంది. ఇందులో ముఖ్యంగా పితృ రుణం గురించి తెలుసుకోవాలి.
Advertisement
also read:బలగం బ్యూటీ చిన్నప్పుడు కూడా చాలా సినిమాల్లో నటించిందనే విషయం మీకు తెలుసా ?
తల్లిదండ్రులే మనకు ప్రత్యక్ష దైవాలు. మనకు జన్మనిచ్చి పెంచి పోషించిన వారి రుణాన్ని తీర్చుకోవాలి. వంశాన్ని అవిచ్చిన్నంగా కొనసాగించడం ద్వారా పితృదేవతలకు తర్ప నాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితృ రుణాన్ని తీర్చుకోవాలి. సంతానం కావాలంటే వివాహం చేసుకోవాలి. అంటే వంశ పరంపరను తెంచవద్దు. ఇలా మూడు కారణాల కోసం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలని వేద పండితులు అంటున్నారు.
also read:మనోబాల ఆ చివరి కోరిక తీరకుండానే మరణించారా..?