Home » బలగం బ్యూటీ చిన్నప్పుడు కూడా చాలా సినిమాల్లో నటించిందనే విషయం మీకు తెలుసా ?

బలగం బ్యూటీ చిన్నప్పుడు కూడా చాలా సినిమాల్లో నటించిందనే విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట అంటూ గంగోత్రి సినిమాలో ఆడి పాడిన చిన్నారి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె పేరు కావ్య కళ్యాణ్ రామ్. గంగోత్రి మూవీలో  చిన్నప్పటి హీరోయిన్ పాత్రలో కావ్య కనిపించింది. అయితే ఆ చిత్రం వచ్చి దాదాపు 20 సంవత్సరాలు  పూర్తయింది.

Advertisement

ఇప్పుడు కావ్య హీరోయిన్  అయిపోయింది. ఇప్పటికే రెండు హిట్ సినిమాల్లో హీరోయిన్ గా  నటించింది కూడా.  దీంతో అలీ, కమల్ హాసన్, మీనా, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి వారి సరసన ఈమె కూడా చేరిందనే చెప్పవచ్చు. ఈమె నటించిన ‘ఉస్తాద్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కీరవాణి తనయుడు సింహా హీరోగా నటించాడు. వారాహి బ్యానర్ పై ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.  సో ఈ మూవీతో కావ్య హిట్ కొట్టి హ్యాట్రిక్ కొడుతుందని అందరూ భావిస్తున్నారు.  ఇది ఇలా ఉంటే.. గంగోత్రితో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ గా కావ్య నటించిన సినిమాలు ఏవో ఇప్పుతు మనం తెలుసుకుందాం.

Also Read : Silk Smitha : సిల్క్ స్మిత మళ్లీ పుట్టిందా… లేక ఆమె కూతురా…?

అక్కినేని నాగార్జున -సుమంత్ కాంబినేషన్ లో వచ్చిన స్నేహమంటే ఇదేరా సినిమాలో కావ్య చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది.

Manam News

అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమాలో కూడా చిన్నప్పటి హీరోయిన్ పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. ముఖ్యంగా ఈ సినిమాలో వల్లంకి పిట్ట అనే పాట ఎంత ఫేమస్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

Gangotri

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బాలు మూవీలో కూడా కావ్య చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది కావ్య.

Advertisement

Manam News

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది.

 

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన అడవి రాముడు చిత్రంలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా నటించింది. ఇందులో  మామిడికాయ కోసే సీన్ ఈ సినిమాకే హైలెట్ చెప్పవచ్చు.

నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన  విజయేంద్ర వర్మ  మూవీలో కూడా కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

Also Read :  ప్రభాస్ మందు తాగితే అలా చేస్తాడా.. సీక్రెట్స్ బయటపెట్టిన గోపీచంద్..!!

అల్లు అర్జున్ హీరోగా వివివినాయక్ తెరకెక్కించిన బన్నీ సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది కావ్య.

 

విక్టరీ వెంకటేష్  హీరోగా తెరకెక్కిన  సుభాష్ చంద్రబోస్   మూవీలో కూడా కావ్య చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది.


బాలకృష్ణ హీరోగా నటించిన   పాండురంగడు   మూవీలో కూడా కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇవే ఇంకా కొన్ని సినిమాల్లో కూడా కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. దాదాపు ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ సాధించాయి. కాకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విజయేంద్ర వర్మ చిత్రం మాత్రంగా సక్సెస్ సాధించలేదు. కావ్య కళ్యాణ్ రామ్ హ్యాట్రిక్ సాధిస్తుందో లేదో వేచి చూడాలి మరి.

Also Read :   ‘కస్టడీ’ మూవీ ట్రైలర్ రిలీజ్… దుమ్ములేపిన నాగచైతన్య

Visitors Are Also Reading