Home » ఆనంద్ దేవరకొండ నటించిన ‘బేబీ’ మూవీ వీక్షించేందుకు ఈ 5 కారణాలు చాలు..!

ఆనంద్ దేవరకొండ నటించిన ‘బేబీ’ మూవీ వీక్షించేందుకు ఈ 5 కారణాలు చాలు..!

by Anji
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. భారీ బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు ఎలాంటి అంచనా లేకుండా విడుదలైన మూవీస్ సూపర్ హిట్ సాధిస్తున్నాయి. అందుకే ఏ సినిమాన కూడా తక్కువగా అంచనా వేయడానికి అస్సలు వీలు లేదనే చెప్పాలి.

Advertisement

అలాగని పెద్ద హీరో అయినంత మాత్రానా ఆ సినిమా హిట్ అవుతుందనుకుంటే పొరపాటు జరిగినట్టే.. చిన్న సినిమాగా వచ్చి మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమాల్లో తాజాగా మరో సినిమా చేరింది. ఆ సినిమానే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన బేబీ.  ఈ చిత్రం చాలా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా చూడటానికి మాత్రం కచ్చితంగా ఈ 5 కారణాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

  1. ప్రస్తుత జెనరేషన్ వారికి ప్రేమ అంటే ఏంటో అస్సలు తెలియదు. ఈ ప్రేమకు అట్రాక్షన్ కి ఉన్న గ్యాప్ ఏంటో కూడా తెలియదు. కానీ బేబీ మూవీ చూస్తే పక్కా ఓ క్లారిటీ వస్తుంది. 
  2. నిజమైన ప్రేమ ఉన్న అబ్బాయి.. తన ప్రేమ కోసం ఎలాంటి పని చేయడానికి అయినా వెనుకాడడు. ఆ విషయం కూడా ఈ మూవీ ద్వారా నిర్దారణ అయింది. 
  3. ముఖ్యంగా నిజమైన ప్రేమ ఉన్న అమ్మాయి ఎలా ఉంటుంది.. డబ్బు కోసం మాత్రమే ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే విషయాలను   దర్శకుడు సాయి రాజేష్ అద్భుతంగా చూపించాడు. 
  4. ఇప్పటి స్మార్ట్ ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి పిల్లలకు ఏం కావాలి..? పెద్దలు పిల్లలతో ఎలా మెలగాలి ? ఎలా వారిని సరైన మార్గంలో పెట్టాలి ? ఎంత కేర్ తీసుకోవాలి వంటి విషయాలను చూపించడంలో దర్శకుడు సక్సెస్ సాధించాడు.
  5. ప్రేమ అనే ముసుగు వేసుకొని ఎలాంటి హద్దులు అయినా దాటే వారి గురించి చాలా నిక్కచ్చిగా దర్శకుడు చూపించాడు. ఇక ఈ 5 అంశాలను దృష్టిలో పెట్టుకొని సినిమా చూస్తే చాలు.. చాలా మంది యువతరంలో మార్పు వచ్చే అవకాశముంది. ఇంకెందుకు ఆలస్యం బేబీ మూవీని వీక్షించండి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 రియల్ స్టార్ హీరో శ్రీహరికి రెండు సార్లు పెళ్లి జరిగిందనే విషయం మీకు తెలుసా ?

స్పైడర్ సినిమా లో విలన్ చిన్నప్పటి పాత్ర చేసిన అబ్బాయి.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

Visitors Are Also Reading